అమలాపురంలో టెన్షన్: కోనసీమ జిల్లా సాధన సమితి ర్యాలీ, పోలీసులపై రాళ్లదాడి

By narsimha lode  |  First Published May 24, 2022, 4:29 PM IST

కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలని ఇవాళ జేఏసీ ఆధ్వర్యంలో అమలాపురం ముట్టడికి ప్రయత్నించిన ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. పోలీసులు లాఠీచార్జీ చేసి ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.


అమలాపురం: కోనసీమ జిల్ల పేరును కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడి Amalapuramలో మంగళవారం నాడు టెన్షన్ కు దారి తీసింది. JAC  నేతలతో పాటు ఆందోళనకారులను Police అడ్డుకున్నారు. అయితే క్రమంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆందోళనకారులను కలెక్టరేట్ వైపునకు వెళ్లకుండా పోలీసులు నియంత్రించే ప్రయత్నం చేశారు. దీంతో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఎస్పీ సుబ్బారెడ్డి వాహనంపై రాళ్ల దాడికి దిగారు.  ఎస్పీ గన్ మెన్లు,  డీఎస్పీకి గాయాలయ్యాయి. 

also read:రాష్ట్రంలో కొత్తగా 9 ఫిషింగ్‌ హార్బర్లు: కోనసీమలో మత్స్యకార భరోసా నిధులు విడుదల చేసిన జగన్

Latest Videos

undefined

జిల్లాకు Konaseema  పేరును కొనసాగించాలని డిమాండ్ తో ఇవాళ అమలాపురం పట్టణం ముట్టడికి జేఏసీ పిలుపునిచ్చింది. ఈ ఆందోళనను పురస్కరించుకొని అమలాపురంలో ఇవాళ 144 సెక్షన్ విధించారు. అమలాపురంలో 25 చోట్ల పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అయితే మధ్యాహ్నం మూడు గంటలకు ఒక్కసారిగా జేఎసీ నేతృత్వంలో ఆందోళనకారులు గడియారం స్థంభం నుండి  Collectorate వరకు ర్యాలీని ప్రారంభించారు. అయితే ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.ఈ సమయంలో పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు.  SP  వాహనంపై రాళ్లు రువ్వడంతో ఎస్పీ తృటిలో ఈ ప్రమాదం నుండి తప్పించుకున్నారు. అయితే అక్కడే ఉన్న డీఎస్పీ, గన్ మెన్లు గాయపడ్డారు. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. దొరికినవారిని దొరికినట్టుగా చితకబాదారు. ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఆందోళనకారులను తరలించేందుకు తీసుకు వచ్చిన వాహనాలను కూడా నిరసనకారులు ధ్వంసం చేశారు. పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో పలు వాహనాలు ద్వంసమయ్యాయి. ఆందోళనకారులు తరలించేందుకు వెచ్చిన  రెండు వాహనాలను  దగ్దం చేశారు. ఆందోళనకారుల దాడిలో డీఎస్పీతో పాటు 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసుల లాఠీచార్జీలో కూడా పలువురు ఆందోళనకారులు కూడా గాయపడ్డారు.

డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా కోనసీమ జిల్లా పేరును మార్చారు.దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీలు ఇచ్చిన వినతి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18న డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 

కోనసీమ జిల్లాగానే పేరును కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆందోళనలు నిర్వహిస్తుంంది. అయిుతే బహిరంగ సభలు, ర్యాలీలకు అనుమతి లేదని కూడా పోలీసులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆంక్షలు విధించారు.

కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలని కొందరు, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు ఉండాలని మరో వర్గం వాదిస్తుంది. రెండు వర్గాలు పోటా పోటీగా  సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ రెండు వర్గాలు తమ వాదనలను సమర్ధించుకుంటున్నాయి.అందరి కోరిక మేరకే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చామని  మంత్రి పినిపె విశ్వరూప్ చెప్పారు. జిల్లా పేరును మార్చాలని కోరిన విషయం తెలిసిందే.

click me!