గుంటూరులో బీజేపీ నేత సత్యకుమార్ కారుపై రాళ్ల దాడి: కారు అద్దాలు ధ్వంసం

By narsimha lode  |  First Published Mar 31, 2023, 3:18 PM IST

బీజేపీ జాతీయ  కార్యదర్శి  సత్యకుమార్  కారుపై  ఇవాళ  ఉద్దండరాయునిపాలెం వద్ద  రాళ్ల దాడి  జరిగింది.



అమరావతి: బీజేపీ జాతీయ  కార్యదర్శి  సత్యకుమార్   కారుపై  శుక్రవారం నాడు  రాళ్ల దాడి  జరిగింది.  ఈ దాడిలో సత్యకుమార్  కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. గుంటూరు జిల్లాలోని  సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద   సత్యకుమార్ కారుపై రాళ్ల దాడి జరిగింది.  వైసీపీ శ్రేణులు ఈ దాడికి పాల్పడ్డాయని  బీజేపీ  నేతలు  ఆరోపిస్తున్నారు.  

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని  కోరుతూ  రైతులు చేస్తున్న ఆందోళన  ఇవాళ్టికి  1200 రోజులకు  చేరుకుంది. ఈ సందర్భంగా మందడంలో  నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది  అమరావతి జేఏసీ. ఈ కార్యక్రమంలో  పలు పార్టీల నేతలు  కూడా పాల్గొన్నారు.  మందడంలో  రైతుల దీక్షలో సత్యకుమార్ పాల్గొన్నారు.  ఈ దీక్ష  శిబిరం నుండి  సత్యకుమార్  తుళ్లూరులో  బీజేపీ కార్యకర్తను  పరామర్శించేందుకు  వెళ్తున్న సమయంలో  సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద   ఈ ఘటన  చోటు  చేసుకుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద  చాలా కాలంగా  వైసీపీ ఎంపీ నందిగం సురేష్ నేతృత్వంలో  మూడు రాజదానులకు అనుకూలంగా దీక్ష  శిబిరం కొనసాగుతుంది.   మూడు రాజధానుల దీక్ష శిబిరంలో  ఉన్నవారు తమపై దాడికి దిగారని సత్యకుమార్  మీడియాకు  చెప్పారు.  

Latest Videos

undefined

సీడ్ యాక్సెస్ రోడ్డు వద్దకు  తన కారు వచ్చిన  సవచ్చిన సమయంలో  పోలీసులు, రోప్ పార్టీ ఉందన్నారు.  తన కారును రోడ్డుపైనే నిలిపివేశారన్నారు. వెంనేట  రాళ్లు, కర్రలతో  తన కారుతో  పాటు కాన్వాయ్ లో  కార్లపై దాడి  చేశారని  సత్యకుమార్ మీడియాకు తెలిపారు. 

బీజేపీ నేత  సత్యకుమార్ ను  కారులో నుండి దిగాలని  మూడు రాజధానుల శిబింరంలో  ఉన్నవారంతా డిమాండ్  చేశారు. సత్యకుమార్ కాన్వాయ్ లో  ఉన్న బీజేపీ  నేత  సురేష్ పై  కొందరు దాడికి దిగారు.   పోలీసులు సురేష్ పై దాడిని అడ్డుకున్నారు.   పోలీసుల సహాయంతో  సత్యకుమార్  అక్కడి నుండి వెళ్లిపోయారు.

అయితే  బీజేపీ  నేతలు  తమ శిబిరం వద్ద  మహిళలపై  విచక్షణ రహితంగా దాడి  చేశారని  బాపట్ల ఎంపీ నందిగం  సురేష్ ఆరోపించారు.  ఈ దాడి విషయమై  బీజేపీ నేతలను ప్రశ్నించామన్నారు. బీజేపీ నేతలు దురుసుగా వ్యవహరించారని  ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. 
 

click me!