తెలంగాణలో గండి, ఏపీ గ్రామాలు మునక : వరదలపై అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Published : Jul 19, 2024, 02:57 PM ISTUpdated : Jul 19, 2024, 04:11 PM IST
తెలంగాణలో గండి, ఏపీ గ్రామాలు మునక : వరదలపై అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ముందస్తు ప్రణాళికతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.  

తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 15 గ్రామాలు, తెలంగాణలో 3 గ్రామాల్లో వరద నీరు చేరే ప్రమాదం ఉందని ముందుగానే అధికారులు హెచ్చరించారు. కాగా, గురువారం రాత్రి తెలంగాణలోని పెద్దవాగుకు గండి పడటంతో ఏపీలోని 14 గ్రామాలు ముంపునకు గురై జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 

మరోవైపు, ఏపీలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో జోరుగా వాన కురుస్తోంది.

కాగా, అల్లూరి సీతారామరాజు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ సెలవులు ప్రకటించారు. నేడు, రేపు (జూలై 19, 20) పాఠశాలలు మూసివేస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులతో రివ్యూ చేశారు. వర్షాలు అధికంగా ఉన్న ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో ఉన్న తాజా పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వాతావరణ శాఖ ద్వారా వర్షాలు, వరదలను అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ముందస్తు ప్రణాళికతో పనిచేయడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. 

ఈ ఏడాది సాధారణ వర్షపాతం 185 మిల్లీమీటర్లు కాగా... ఇప్పటివరకు 244 మిల్లీమీటర్లు నమోదైందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 శాతం అదనంగా వర్షపాతం నమోదైందన్నారు. 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయిన ప్రాంతాలు కూడా ఉన్నాయన్నాన్న సీఎం... చెరువు కట్టలు, వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల వల్ల గోదావరి కట్టలు బలహీన పడ్డాయని, వీటిపై దృష్టిపెట్టాలన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఫ్లడ్ మాన్యువల్ ద్వారా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. విపత్తులు వచ్చినప్పుడే పనితీరు, సమర్థత బయటపడుతుందని... వర్షాల నేపథ్యంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా, డైనమిక్‌గా పనిచేయాలన్నారు. వర్షాలు, వరదలు వచ్చిన తరువాత కాకుండా వాతావరణ శాఖ హెచ్చరికలు, పరిస్థితులను అంచనా వేసి అప్రమత్తంగా వ్యవహరిస్తే నష్టాలను నివారించగలుగుతామని సూచించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో గతంలో ఉన్న వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని... మళ్లీ వాటిని యాక్టివేట్ చేయాలని సూచించారు. ఈ కాన్ఫరెన్స్ లో అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Perni Nani press meet: మోయ‌లేని గుదిబండగా అమ‌రావ‌తి చంద్రబాబుపై పేర్నినాని సెటైర్లు | Asianet Telugu
Raghurama KrishnamRaju: మావాళ్లని మోసం చేయొద్దు | Update on Akividu Ramalayam | Asianet News Telugu