నెల్లూరు జిల్లాలో అప్పు చెల్లించమని అడిగినందుకు గాను మహిళను ఓ వ్యక్తి చెప్పుతో కొట్టాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
నవాబుపేట:నెల్లూరు జిల్లా నవాబుపేటలో నడిరోడ్డుపై మహిళను శ్రీకాంత్ అనే వ్యక్తి చెప్పుతో కొట్టాడు. అప్పు చెల్లించమని అడిగినందుకు దాడి చేసినట్టుగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ పిర్యాదు ఆధారంగా నిందితుడు శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
దేశంలోని పలు చోట్ల ఇటీవల కాలంలో చెప్పుతో దాడి చేసిన ఘటనలు నమోదౌతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లో మద్యం సేవించి ప్రతి రోజూ కాలనీలో గొడవలకు దిగేవాడు. మహిళలను టీజ్ చేసేవాడు. ఒక రోజు సాయంత్రం ఇంటి నుండి బయటకు వచ్చిన మహిళను అతను అసభ్యంగా కామెంట్స్ చేశాడు. దీంతో ఆమె వెంటనే చెప్పు తీసుకొని అతడిపై దాడి చేసింది. ఈ పరిణామంతో అతను పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతడిని వెంటాడి ఆమె చెప్పుతో కొట్టింది.
undefined
ఇదిలా ఉంటే నల్గొండ జిల్లాలోని నార్కట్ పల్లి మండలం బాజకుంటలో దళితులపై మహిళా సర్పంచ్ చెప్పుతో దాడికి దిగింది.ఈ ఘటనపై దళిత సంఘాలు ఆందోళన నిర్వహించాయి. గ్రామంలో జరిగిన గొడవ విషయమై దళితులకు గ్రామ సర్పంచ్ బంధువులకు మధ్య గొడవ జరిగింది. ఈ విషయమై పంచాయితీ జరిగింది. ఈ సమయంలో సర్పంచ్ ఇద్దరు దళితులపై చెప్పుతో దాడి చేశారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో ఓ యువతిని ప్రేమిస్తున్నానని యువకుడు వేధించాడు. కొంత కాలం పాటు ఈ వేధింపులు భరించిన యువతి చివరకు తన చెప్పు తీసి యువకుడిని చితకబాదింది.రోడ్డుపై యువకుడిని చితకబాదుతున్న యువతిని చూసిన స్థానికులు అక్కడికి చేరుకుని విషయం ఆరా తీశారు. జరిగిన విషయం చెప్పడంతో స్థానికులు కూడా అతనికి బుద్ది చెప్పారు.
హైద్రాబాద్ బాలానగర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానని ఓ వ్యక్తి మహిళ నుండి రూ. 10 లక్షలు వసూలు చేశాడు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పించలేదు. ఈ డబ్బులు తిరిగి ఇవ్వలేదు. కార్పోరేటర్ ఆఫీస్ వద్దకు మోసగాడిని పిలిపించి అసలు విషయం చెప్పింది బాధితురాలు. అందరూ చూస్తుండగానే చెప్పుతో కొట్టింది.