
శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు, ఎర్రన్నాయుడి కుమారుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడి పెళ్లి జూన్ 14 జరుగుతున్నది. ఆ రోజు తెల్లవారుజామున 3:01 గంటలకు విశాఖ ఆంధ్రాయూనివర్శిటీ మైదానంలో వివాహం. 18 వ తేదీన శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో విందు. తరన వివాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఆహ్వానిస్తూ రామ్మోహన్ నాయుడు ఈ రోజు శుభలేఖ అందజేశారు.
బాబాయి, రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, తల్లి విజయలక్ష్మి, సోదరి భవాని మరికొంతమంది కుటుంబ సీఎంను కలిసి శుభలేఖతో పాటు పట్టువస్త్రాలు సమర్పించి ఆహ్వానం పలికారు.
తప్పకహాజరవుతానని చెబుతూ పెళ్లి ఏర్పాట్లపై సీఎం అడిగి తెలుసుకున్నారు.