మాస్క్ లేకుండా ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి డ్యాన్స్: టీడీపీ ఫైర్

Published : Sep 13, 2020, 04:46 PM IST
మాస్క్ లేకుండా ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి డ్యాన్స్: టీడీపీ ఫైర్

సారాంశం

 శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తారు. విద్యార్ధులతో కలిసి ఆయన డ్యాన్స్ చేసి మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. అయితే ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తారు. విద్యార్ధులతో కలిసి ఆయన డ్యాన్స్ చేసి మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. అయితే ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలను ఇవాళ  శ్రీకాళహస్తిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి డ్యాన్స్ చేశాడు. ముఖానికి మాస్కు పెట్టుకోకుండానే ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి విద్యార్థుల మధ్య నిలబడి డ్యాన్స్ చేయడంపై టీడడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా బారినపడిన ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి ఇటీవలనే కోలుకొన్నారు. కరోనా నుండి కోలుకొన్న ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి విద్యార్థుల మధ్య మాస్కు లేకుండా డ్యాన్స్ చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా సమయంలో మాస్కు లేకుండా ఎమ్మెల్యే డ్యాన్స్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో కరోనా లాక్ డౌన్ సమయంలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా అప్పట్లో ఎమ్మెల్యే ర్యాలీ నిర్వహించారని టీడీపీ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: అధికారులకు చంద్రబాబు హెచ్చరిక | Asianet News Telugu
CM Chandrababu Naidu: చరిత్రలో నిలిచిపోయే రోజు సీఎం చంద్రబాబు| Asianet News Telugu