దక్షిణకాశీగా పేరొందిన శ్రీకాళహస్తి రాజకీయంగానూ హీట్ పుట్టిస్తోంది. 2019 ముందు వరకు శ్రీకాళహస్తిలో టీడీపీ , కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లుగా తలపడేవి. కాంగ్రెస్ పార్టీ 6 సార్లు, టీడీపీ 7 సార్లు, వైసీపీ ఒకసారి, స్వతంత్రులు రెండు సార్లు విజయం సాధించారు.
శ్రీకాళహస్తి .. ఈ పేరు వినగానే పంచ భూత లింగాల్లో ఒకటైన వాయు లింగం గుర్తొస్తుంది. దక్షిణకాశీగా పేరొందిన శ్రీకాళహస్తి రాజకీయంగానూ హీట్ పుట్టిస్తోంది. ఈ నియోజకవర్గంలో బీసీలు, బలిజ ఓటర్లు ఎక్కువ. వారు ఎటు వైపు మొగ్గు చూపితే ఆ పార్టీదే విజయం. అయినప్పటికీ రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే ఎక్కువగా గెలుస్తూ వస్తున్నారు. 2019 ముందు వరకు శ్రీకాళహస్తిలో టీడీపీ , కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లుగా తలపడేవి. 1952లో ఏర్పడిన ఈ సెగ్మెంట్ పరిధిలో రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాలున్నాయి. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,37,666 మంది.
శ్రీకాళహస్తి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. కాంగ్రెస్, టీడీపీలకు కంచుకోట :
undefined
కాంగ్రెస్ పార్టీ 6 సార్లు, టీడీపీ 7 సార్లు, వైసీపీ ఒకసారి, స్వతంత్రులు రెండు సార్లు విజయం సాధించారు. దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇక్కడి నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగానూ సేవలందించారు. అద్దూరు బాలరామిరెడ్డి రెండు సార్లు కాంగ్రెస్ టికెట్‌పై , ఒకసారి ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి బియ్యపు మధుసూదన్ రెడ్డికి 1,09,541 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి బొజ్జల సుధీర్ రెడ్డికి 71,400 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైపీపీ 38,141 ఓట్ల భారీ మెజారిటీతో శ్రీకాళహస్తిలో తొలిసారి పాగా వేసింది. 2024 ఎన్నికల విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి టికెట్ కేటాయించారు.
శ్రీకాళహస్తి శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. టీడీపీ పుంజుకుంటుందా :
టీడీపీ విషయానికి వస్తే.. శ్రీకాళహస్తి ఆ పార్టీకి కంచుకోట. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి బతికి వున్నంత కాలం తెలుగుదేశానికి నియోజకవర్గంలో ఎదురులేకుండాపోయింది. ఆయన మరణం తర్వాత 2019 ఎన్నికల్లో బొజ్జల కుమారుడు సుధీర్ రెడ్డికే టికెట్ కేటాయించారు చంద్రబాబు. దురదృష్టవశాత్తూ ఆయన ఓడిపోయారు. 2024లో మరోసారి అవకాశం కల్పించింది హైకమాండ్.