ఏంది సామీ ఇదీ ... చంద్రబాబు ఫ్యామిలీకి నాలుగు రోజుల్లోనే రూ.858 కోట్లా!!

By Arun Kumar P  |  First Published Jun 8, 2024, 12:04 PM IST

ఎన్నికల ఫలితాలు వెలువడి కేవలం నాలుగే నాలుగు రోజులయ్యింది. ఇంకా టిడిపి ప్రభుత్వం ఏర్పడలేదు... చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టలేదు. కానీ అప్పుడే చంద్రబాబు కుటుంబం వందలకోట్లు సంపాదించింది... ఎలాగో తెలుసా..?


అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయాన్ని అందుకుంది. ఎవరూ ఊహించని రీతిలో ఓట్లు, సీట్లు సాధించింది టిడిపి, జనసేన, బిజెపి కూటమి. ఇలా వైసిపిని మట్టికరిపించి రాష్ట్రంలో అధికారంలోకి రావడమే కాదు కేంద్రంలోనూ ఏన్డిఏ సర్కార్ ఏర్పాటులో టిడిపి కీలకంగా మారింది. దీంతో చంద్రబాబు పలుకుబడి అమాంతం రెట్టింపయ్యింది... ఇదే సమయంలో ఆయన కుటుంబఆదాయం కూడా అమాంతం పెరిగింది. గత నాలుగు రోజుల్లోనే చంద్రబాబు కుటుంబానికి వందల కోట్లు వచ్చిపడ్డాయి.  

హెరిటేజ్ ఫుడ్స్ లో చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులు భారీగా షేర్లు వున్నాయి. ఈ క్రమంలో తిరిగి టిడిపి అధికారంలోకి రావడంతో హెరిటేజ్ షేర్ల విలువ భారీగా పెరిగింది. ప్రస్తుతం హెరిటేజ్ ఓక్క షేర్ విలువు రూ.259గా వుంది. ఈ లెక్కన చంద్రబాబు నాయుడు కుటుంబ షేర్ల విలువ ఏకంగా రూ.858 కోట్లకు చేరింది. 

Latest Videos

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడి టిడిపి ప్రభుత్వాన్నిఏర్పాటుచేయడం ఖాయం కాగానే హెరిటేజ్ షేర్లు పుంజుకున్నాయి. భారీ డిమాండ్ కారణంగా ఏకంగా 64శాతానికి షేర్ విలువ పెరిగింది.  దీంతో హెరిటేజ్ ఫుడ్స్ లో అత్యధిక షేర్లు కలిగిన చంద్రబాబు కుటుంబంలో సిరులపంట పండింది. 

ఏపీ సీఎంగా త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్న చంద్రబాబు నాయుడుకు తప్ప ఆయన కుటుంబసభ్యులదరికీ హెరిటేజ్ లో షేర్లు వున్నాయి. మొత్తంగా ఆయన కుటుంబం 35.71 శాతం అంటే 3,31,36,005 షేర్లను కలిగివుంది. ఎన్నికల ఫలితాల తర్వాత ఈ షేర్ల విలువ భారీగా పెరిగింది.

చంద్రబాబు కుటుంబంలో ఎవరికెన్ని షేర్లు : 

హెరిటేజ్ ఫుడ్స్ లో అత్యధిక వాటా కలిగివున్నారు నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి. ఆమెకు ఏకంగా 24 శాతం షేర్లు వున్నాయి. ఆ తర్వాత నారా లోకేష్ కు 10.82 శాతం షేర్లు కలిగివున్నారు. ఇక నారా బ్రాహ్మణికి 0.46, నారా దేవాన్ష్ కు 0.06 శాతం షేర్లు వున్నాయి. ఇలా నారా కుటుంబానికి హెరిటేజ్ లో 35.71 శాతం షేర్లు వున్నాయి.

అమర రాజా షేర్లు కూడా భారీగా పెరుగుదల...

చంద్రబాబు కుటుంబంతో పాటు టిడిపి నాయకులకు చెందిన కంపనీల షేర్లు కూడా ఎన్నికల ఫలితాల తర్వాత భారీగా పెరుగుతున్నాయి. ఇలా టిడిపి మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ఎండీగా కొనసాగుతున్న అమర రాజా ఎనర్జీ ఆండ్ మొబిలిటీ లిమిటెడ్ షేర్లు కూడా భారీగా పెరిగాయి. వరుసగా రెండు సెషన్లలో ఈ కంపనీ షేర్ వ్యాల్యూ 22 శాతానికి పైగా పెరిగింది. గరిష్టంగా రూ.1333 తాకిన అమర రాజా షేర్ విలువ ప్రస్తుతం రూ.1276 వద్ద కొనసాగుతోంది. 


 

 
 
 

click me!