ప్రముఖ జర్నలిస్టు వాసుదేవ దీక్షితులు కన్నుమూత

By telugu teamFirst Published Apr 12, 2019, 3:02 PM IST
Highlights

 ఆంధ్రప్రభ దిన పత్రిక మాజీ సంపాదకులు, వి.వి.వాసుదేవ దీక్షితులు శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కూడా ఆయన పనిచేశారు. ఆయన వయసు 76 ఎళ్లు. 

హైదరాబాద్: ఆంధ్రప్రభ దిన పత్రిక మాజీ సంపాదకులు, వి.వి.వాసుదేవ దీక్షితులు శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కూడా ఆయన పనిచేశారు. ఆయన వయసు 76 ఎళ్లు. 

ఆయనకు భార్య, వివాహితులైన ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. 

సికింద్రాబాద్ కల్యాణ పురిలోని స్వగృహానికి ఆయన భౌతిక కాయాన్ని తరలించారు. శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలియజేశారు. విశాలాంధ్రతో ఆయన పాత్రికేయ జీవితం ప్రారంభమైంది.

దీక్షితులు 1942 ఫిబ్రవరి 15న జన్మించారు. 967లో ఆంధ్రప్రభ దినపత్రికలో సబ్‌ఎడిటర్‌గా చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 1991లో ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1999 మార్చిలో పదవీ విరమణ చేసేవరకు వాసుదేవ దీక్షితులు అదే బాధ్యతల్లో కొనసాగారు. 

జర్నలిజంలో చేసిన సేవలకు గాను తెలుగు విశ్వవిద్యాలయం, మద్రాసు తెలుగు అకాడమీల నుంచి ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు. పాత్రికేయ రంగంలోకి రాకముందు కొంత కాలం డిఫెన్స్ అకౌంట్స్ విభాగంలో, ఫుణెలోని నేషనల్ కెమికల్ ల్యాబరేటరీలో ఉద్యోగం చేశారు. 

click me!