ఏపీలో రిజిస్ట్రేషన్లు ఇక సులువు.. ఈ నెల 31 నుంచి కొత్త సాఫ్ట్‌వేర్, ఆన్‌లైన్‌లోనే మొత్తం ప్రక్రియ

Siva Kodati |  
Published : Aug 29, 2023, 02:33 PM IST
ఏపీలో రిజిస్ట్రేషన్లు ఇక సులువు.. ఈ నెల 31 నుంచి కొత్త సాఫ్ట్‌వేర్, ఆన్‌లైన్‌లోనే మొత్తం ప్రక్రియ

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 31 నుంచి అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కొత్త సాఫ్ట్‌వేర్‌ను అమల్లోకి తెస్తోంది ఏపీ ప్రభుత్వం.  కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషణ్ డిపార్ట్‌మెంట్ (కార్డ్)ను ఆధునీకరించి కార్డ్ 2.0కు రూపకల్పన చేస్తోంది 

ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 31 నుంచి అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కొత్త సాఫ్ట్‌వేర్‌ను అమల్లోకి తెస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా వినియోగదారుల సమయం వృథా అవ్వదు అంటున్నారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రామకృష్ణ. ‘‘కార్డ్ ప్రైమ్’’ సాఫ్ట్‌వేర్ ద్వారా నేరుగా రిజిస్ట్రేషన్‌కు డిజిటల్ సైన్ ద్వారా అప్లయ్ చేస్తే.. నేరుగా డాక్యుమెంట్‌ను మెయిల్ చేస్తామంటున్నారు. ఈ నెల 15 లోపు అన్ని చోట్లా అమల్లోకి తెస్తామన్నారు. 

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీ వైపుకు నడిపిస్తోంది. కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషణ్ డిపార్ట్‌మెంట్ (కార్డ్)ను ఆధునీకరించి కార్డ్ 2.0కు రూపకల్పన చేస్తోంది ప్రభుత్వం. దీని ద్వారా స్టాంపు పేపర్లు, సంతకాలతో పనిలేకుండా సులువుగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. కేవలం బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర వేయడానికి 5 నుంచి 10 నిమిషాలు వుంటే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం బయట జరిగే పనిని సులభంగా ఆన్‌లైన్లోనే చేసుకోవచ్చు. దీనిని పబ్లిక్ డేటా ఎంట్రీ ఇంటిగ్రేషన్ అంటారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్