అన్నమయ్య జిల్లాలో విషాదం: ప్రేమ జంట ఆత్మహత్య

By narsimha lode  |  First Published Aug 29, 2023, 1:33 PM IST

అన్నమయ్య జిల్లాలో మంగళవారంనాడు విషాదం చోటు చేసుకుంది. ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది.


తిరుపతి: అన్నమయ్య జిల్లాలో మంగళవారంనాడు  విషాదం చోటు చేసుకుంది.  ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.అన్నమయ్య జిల్లా పెద్దమండ్యలో  ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.మృతులను  పురుషోత్తం, సౌమ్య లుగా  గుర్తించారు. మృతులను రాయచోటి మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందినవారుగా గుర్తించారు.

గతంలో కూడ  ప్రేమ జంటలు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు  దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్నాయి.   పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదనో, ఇతరత్రా కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్నారు. చిన్న చిన్న కారణాలతో కూడ ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడ లేకపోలేదు.అయితే చిన్న చిన్న కారణాలకు  ఆత్మహత్యలు చేసుకోవద్దని మానసిక నిపుణులు చెబుతున్నారు.

Latest Videos

undefined

అన్నమయ్య జిల్లాలోని  మదనపల్లె మండలం  కొత్తవారిపల్లె అబ్బగొంది అటవీ ప్రాంతంలో  ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన ఈ ఏడాది మే  15న చోటు చేసుకుంది. బైక్ పై వచ్చిన ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. గొర్రెల కాపరులకు దుర్వాసన రావడంతో  అటు గా వెళ్లి చూశారు. దీంతో  ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంటను చూసి వారు  పోలీసులకు సమాచారం ఇచ్చారు.

తిరుపతి జిల్లాలోని భాకారాపేట అడవుల్లో  మైనర్ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల  20వ తేదీన ఈ ఘటన  వెలుగు చూసింది.  చౌడేపల్లి మండలం కొత్తిండ్లకు చెందిన  యుగంధర్,  రామసముద్రం మండలం చిట్టెంవారిపల్లికి చెందిన కళ్యాణి ఆత్మహత్యకు పాల్పడ్డారు.తమ ప్రేమకు పెద్దలు అంగీకరించరనే ఉద్దేశ్యంతో ఈ జంట ఆత్మహత్యకు పాల్పడిందని  పోలీసులు అనుమానిస్తున్నారు.

హైదరాబాద్ కేపీహెచ్‌బీ  కాలనీలో  ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఈ ఏడాది మే 15 న జరిగింది.  పశ్చిమగోదావరి జిల్లా  భీమవరం గొల్లవానితిప్పకు చెందిన  శ్యామ్, జ్యోతిలు  ఆత్మహత్య చేసుకున్నారు.  హైద్రాబాద్ కు వచ్చి వీరిద్దరూ సూసైడ్ చేసుకున్నారు.

గుంటూరు  జిల్లాలో  ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకన్న ఘటన ఈ ఏడాది మార్చి 29న చోటు చేసుకుంది.  ఉయ్యూరుకు చెందిన శ్రీకాంత్, అదే గ్రామానికి చెంది త్రివేణి ఆత్మహత్య చేసుకున్నారు.

ఆత్మహత్యలు పరిష్కారం కాదు

అయితే  చిన్న చిన్న విషయాలకు  ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి.  జీవితంలో వచ్చిన సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని మానసిక నిపుణులు చెబుతున్నారు.

జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.

 

click me!