జగన్ పై దాడి కేసు: శ్రీనివాసరావు కోర్కెల చిట్టా ఇదీ.......

By Nagaraju TFirst Published Jan 26, 2019, 10:20 AM IST
Highlights

‘నన్ను సాధారణ ఖైదీలా చూస్తున్నారు. జైల్లో పెద్దపెద్ద కేసుల్లో ఉన్న ఖైదీలంతా నా వెనుక అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంది’ అని శ్రీనివాసరావు న్యాయమూర్తి ఎదుట శ్రీనివాసరావు వాపోయారు. 

విజయవాడ: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రిమాండ్ గడువు ముగియడంతో శుక్రవారం విజయవాడ మెట్రోపాలిటన్ సెసన్స్ కోర్టులో నిందితుడిని హాజరుపరిచారు. 

ఈ సందర్భంగా నిందితుడు శ్రీనివాసరావు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ లో తనకు ప్రాణ హాని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రత కల్పించడంతోపాటు ప్రత్యేక సెల్ ను కేటాయించాలని మెట్రో సెషన్స్ న్యాయమూర్తి పార్థసారధిని వేడుకున్నాడు. 

‘నన్ను సాధారణ ఖైదీలా చూస్తున్నారు. జైల్లో పెద్దపెద్ద కేసుల్లో ఉన్న ఖైదీలంతా నా వెనుక అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంది’ అని శ్రీనివాసరావు న్యాయమూర్తి ఎదుట శ్రీనివాసరావు వాపోయారు. 

తనకు జైల్లో ప్రత్యేకంగా సెల్‌ను కేటాయించాలని వేడుకున్నాడు. జైల్లో ఉన్నంతకాలం తాను పుస్తకం రాసుకునేందుకు కాగితాలు, పెన్‌, రోజువారి న్యూస్ పేపర్ ఇప్పించాలని కోరాడు. శ్రీనివాసరావు విజ్ఞప్తిని న్యాయమూర్తి పార్థసారధి ఆమోదించారు. శ్రీనివాసరావుకు ప్రత్యేక సెల్ తోపాటు కాగితాలు, పెన్, న్యూస్ పేపర్లు ఇవ్వాలని ఆదేశించారు. 

ఈ విషయాలను న్యాయమూర్తి కోర్టు డైరీలో నమోదు చేయించారు. ఇరువాదనలు విన్న కోర్టు శ్రీనివాసరావు రిమాండ్ ను ఫిబ్రవరి 8 వరకు పొడిగించింది. మరోవైపు  శ్రీనివాసరావు తరఫు న్యాయవాది సలీం దాఖలు చేసిన పిటిషన్లను మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి పార్థసారథి కొట్టేశారు. 

విశాఖపట్నం జైల్లో ఉండగా శ్రీనివాసరావు రాసుకున్న 22 పేజీల లేఖను అప్పగించాలని, కస్టడీకి తీసుకున్న తర్వాత ఎన్‌ఐఏ అధికారులు మొదటి మూడు రోజులు చేసిన విచారణను పరిగణనలోకి తీసుకోవద్దని దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేశారు.  

నిందితుడు శ్రీనివాసరావును కస్టడీకి తీసుకునే సమయంలో ఎన్ఐఏ అధికారులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని ఎన్ఐఏ ప్రొసీడింగ్ ను ఆపాలని మరో రెండు పిటీషన్లు దాఖలు చేశారు. అనంతరం న్యాయమూర్తి నిందితుడు పార్థసారథికి ఫిబ్రవరి 8వరకు రిమాండ్ విధించింది.

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ పై దాడికేసు.. నిందితుడికి ప్రత్యేక బ్యారక్

ముగిసిన శ్రీనివాసరావు కస్టడి గడువు, ఎన్ఐఏ ఛార్జిషీట్‌లో ఏముంది..?

జగన్‌పై దాడి కేసు...నార్కో పరీక్షకు సిద్దమే: నిందితుడి తరపు లాయర్

జగన్‌పై దాడి కేసు: శ్రీనివాసరావును కస్టడీలోకి తీసుకోనున్న ఎన్ఐఏ

జగన్‌పై దాడి: పర్మిట్ లేని శ్రీనివాస్ అక్కడికి ఎలా వెళ్లాడు

జగన్‌పై దాడి: సీసీకెమెరాల వైఫల్యంపై హైకోర్టు ఆగ్రహం

click me!