జగన్ పై దాడికేసు.. నిందితుడికి ప్రత్యేక బ్యారక్

By ramya neerukondaFirst Published Jan 25, 2019, 3:14 PM IST
Highlights

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై గతేడాది విశాఖపట్నం ఎయిర్ పోర్టులో దాడి జరిగిన సంగతి తెలిసిందే. 


ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై గతేడాది విశాఖపట్నం ఎయిర్ పోర్టులో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు శుక్రవారం ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచారు.

నిందితుడు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన రెండు మమోలను  విచారించిన కోర్టు.. శ్రీనివాస్ కు ఫిబ్రవరి 8వ తేదీ వరకు జుడీషియల్ రిమాండ్ విధించింది. నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని కోర్టు అధికారులను ఆదేశించింది.

రాజమండ్రి సెంట్రల్ జైల్లో శ్రీనివాస్ కి ప్రత్యేక బ్యారక్ తోపాటు పెన్ను, పుస్తకం, న్యూస్ పేపర్ అందించాలని అతని తరపు న్యాయవాదులు కోరగా.. అందుకు కోర్టు అంగీకరించింది. 

click me!