జలీల్‌ఖాన్‌పై ఫిర్యాదు చేస్తా: నాగుల్ మీరా

Published : Jan 25, 2019, 02:49 PM IST
జలీల్‌ఖాన్‌పై ఫిర్యాదు చేస్తా: నాగుల్ మీరా

సారాంశం

 విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని  రాష్ట్ర పోలీస్ హౌసింగ్  కార్పోరేషన్ ఛైర్మెన్ నాగుల్ మీరా  ఆరోపించారు. పార్టీ నిబంధనావళిని పట్టించుకోవడం లేదని  ఆయన చెప్పారు.


విజయవాడ: విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని  రాష్ట్ర పోలీస్ హౌసింగ్  కార్పోరేషన్ ఛైర్మెన్ నాగుల్ మీరా  ఆరోపించారు. పార్టీ నిబంధనావళిని పట్టించుకోవడం లేదని  ఆయన చెప్పారు.

నాగుల్ మీరా   ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబును తన కుమార్తెతో కలిసి జలీల్‌ఖాన్ భేటీ కావడంలో  తప్పు లేదన్నారు. అయితే  తన కూతురే  వచ్చే ఎన్నికల్లో  పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు.  ఈ విషయమై చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామన్నారు.

అభ్యర్తుల ప్రకటనకు సీఎం చంద్రబాబునాయుడు  కసరత్తు చేస్తున్నారని  ఆయన చెప్పారు. అయితే  సీఎం ఏ నిర్ణయం తీసుకొన్న తమకు అభ్యంతరం లేదన్నారు. సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. కానీ, జలీల్‌ఖాన్  టీడీపీ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేయడాన్ని ఆయన తప్పుబట్టారు.
 

PREV
click me!

Recommended Stories

పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu
300 ఎక‌రాల్లో, రూ. 8,175 కోట్ల పెట్టుబ‌డి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఈ గ్రామం రూపు రేఖ‌లు మార‌డం ఖాయం