మహిళా సాధికారతపై ప్రకటనట ?

First Published Sep 28, 2017, 9:07 AM IST
Highlights
  • అక్టోబర్లో రెండోవారంలో మహిళా సాధికారతకు సంబంధించి ప్రకటన సిద్ధమవుతోందట.  
  • పైగా బ్రహ్మాండంగా సదస్సును నిర్వహించి మరీ ప్రకటన చేయాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆదేశాలు.
  • సదస్సుకు రాజకీయ వాసనలు లేకుండా చూడాలని గట్టిగా ఆదేశించారట స్పీకర్. ఎంత కామిడీగా ఉందో కదా ఆ ప్రకటన?  
  • మొన్న జరిగిన సదస్సు సందర్భంగానే అధికార పార్టీ, స్పీకర్ కలిసి ఎంతటి రాజకీయం చేసిందీ అందరూ చూసిందే.

అక్టోబర్లో రెండోవారంలో మహిళా సాధికారతకు సంబంధించి ప్రకటన సిద్ధమవుతోందట.  పైగా బ్రహ్మాండంగా సదస్సును నిర్వహించి మరీ ప్రకటన చేయాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆదేశాలు. సదస్సుకు రాజకీయ వాసనలు లేకుండా చూడాలని గట్టిగా ఆదేశించారట స్పీకర్. ఎంత కామిడీగా ఉందో కదా ఆ ప్రకటన?  మొన్న జరిగిన సదస్సు సందర్భంగానే అధికార పార్టీ, స్పీకర్ కలిసి ఎంతటి రాజకీయం చేసిందీ అందరూ చూసిందే.

ప్రతిపక్ష ఎంఎల్ఏ రోజాను రెండుసార్లు ఆహ్వానించింది స్పీకర్ కార్యాలయం. సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన సమయంలో విమానాశ్రయంలోనే రోజాను పోలీసులు అరెస్టు చేసి హై డ్రామా మధ్య హైదరాబాద్ కు తరలించిన సంగతి ఎవరు మాత్రం మరచిపోగలరు? మాట్లాడిన వాళ్ళందరూ చంద్రబాబునాయుడును పొగడటం, స్పీకర్ ను పొగడటం మినహా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను, పరిష్కారాలను ఎవరైనా ప్రస్తావించారా?

సరే, ఇక ప్రస్తుత విషయానికి వస్తే రాష్ట్రంలో మహిళా సాధికారితపై ప్రకటన చేసే నైతికత చంద్రబాబు ప్రభుత్వానికి ఉందా అన్నదే పెద్ద ఫ్రశ్న. ఎందుకంటే, ఈ సంవత్సరంలోనే చివరి నాలుగు మాసాల్లోనే రాష్ట్రవ్యాప్తంగా మహిళలు బాధితులుగా సుమారు 5600 కేసలు నమోదయ్యాయి. ఇది ప్రతిపక్షాలు చెబుతున్న లెక్కలు కాదు. సాక్ష్యాత్తు జిల్లాల కలెక్టర్లు ముఖ్యమంత్రికి ఇచ్చిన నివేదికల్లోని వివరాలే. ఇక మూడున్నరేళ్ళలో మహిళలపై జరిగిన అత్యాచారాలు, హత్యలు, అత్యాచార యత్నాలు, గృహహింసలైతే లెక్కేలేదు. ‘‘మహిళలకు రక్షణ లేని చోట మహిళా సాధికారతా’’?

రాష్ట్రంలో మూడున్నరేళ్ళలో మహిళలపై ఒక్కసారిగా పెరిగి పోయిన హింసలో చాలా వరకూ టిడిపి నేతల హస్తముందనే ఆరోపణలకు కొదవే లేదు.  అందుకు ఆమద్య సంచలనం సృష్టించిన ‘‘కాల్ మనీ సెక్స్ రాకెట్ ’’ పెద్ద ఉదాహరణ. ప్రతీ ఉదంతం వెనుకా తమ్ముళ్ళ మద్దతుండబట్టే ఎవరిపైనా చర్యలుండటం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయ్. ఇటువంటి నేపధ్యంలో ‘‘అమరావతి’’ ప్రకటనపై ఎంత గొప్పగా సదస్సు నిర్వహిస్తే మాత్ర ఏంటి ఉపయోగం?

click me!