అదృశ్యమైన అక్కా చెల్లెళ్లు: ఇంటికొచ్చిన చిన్న కూతురు

Published : Feb 13, 2019, 01:01 PM IST
అదృశ్యమైన అక్కా చెల్లెళ్లు: ఇంటికొచ్చిన చిన్న కూతురు

సారాంశం

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కలిసేందుకు వెళ్లిన అక్కా చెల్లెళ్లలో ఓ యువతి ఇంటికి చేరుకొంది. మరో యువతి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కలిసేందుకు వెళ్లిన అక్కా చెల్లెళ్లలో ఓ యువతి ఇంటికి చేరుకొంది. మరో యువతి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ నెల 4వ తేదీన ఇద్దరు యువతులు  తమ తల్లి జ్యోతి ఆరోగ్యం బాగాలేదని, ఆమెకు సహాయం చేయాలని కోరేందుకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కలిసేందుకు వెళ్తున్నట్టు చెప్పి వెళ్లారు. అప్పటి నుండి వారిద్దరి ఆచూకీ లభ్యం కాలేదు.

ఈ విషయమై యువతుల తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జ్యోతి రెండో కుమార్తె మంగళవారం నాడు ఇంటికి చేరుకొంది. ఆమెను పోలీసులు విచారించారు. ఏలూరులో తాను చదువుకొన్న  పాఠశాలలో సర్టిఫికెట్లు తెచ్చుకొనేందుకు వెళ్లినట్టు ఆ యువతి పోలీసులకు చెప్పింది.

తన అమ్మ్మ ఇంటి వద్దే ఉన్నానని ఆమె చెప్పినట్టు సమాచారం. ఇదిలా ఉంటే తన అక్క  ఈ నెల 5వ తేదీనే ఏలూరు నుండి విజయవాడకు వచ్చిందని  ఆమె పోలీసులకు చెప్పారు. జ్యోతి పెద్ద కుమార్తె ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

చింతమనేని సహాయం కోసం వెళ్లిన అక్కాచెల్లెళ్ల అదృశ్యం


 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu