Extramarital Affair: తండ్రి చనిపోయాడు.. తల్లి వివాహేతర సంబంధం.. కొడుకు ఏం చేశాడంటే?

Published : Aug 13, 2022, 06:12 PM IST
Extramarital Affair: తండ్రి చనిపోయాడు.. తల్లి వివాహేతర సంబంధం.. కొడుకు ఏం చేశాడంటే?

సారాంశం

తల్లికి వివాహేతర సంబంధం ఉన్నదని తెలిసి ఆ కొడుకు చలించిపోయాడు. తండ్రి అప్పటికే మరణించాడు. వివాహేతర సంబంధం వద్దని వారించినా తల్లి వినడం లేదు. దీంతో ఆ వ్యక్తి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మద్యం సేవించి ఉరి వేసుకుని ప్రాణం విడిచాడు.  

ఏలూరు: ఆ దంపతులకు ఒక కొడకు. కుమారుడి చిన్న తనంలోనే తండ్రి మరణించాడు. తల్లి కష్టపడి ఆ కుమారుడిని పెంచింది. కుమారుడు కూడా చిన్న వయసులో కుటుంబ బాధ్యతలు తీసుకున్నాడు. పనిలో చేరాడు. తాపీ కార్మికుడిగా మారాడు. తండ్రి మరణించడంతో వారిద్దరూ కలిసి ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కానీ, వీరి జీవితాలు మరో అవాంఛనీయ మలుపు తిరిగాయి. తల్లి వివాహేతర సంబంధం పెట్టుకున్నది. ఈ విషయం కొడుక్కి తెలిసింది. తల్లిని చాలా సార్లు వారించాడు. ఎన్ని సార్లు మందలించిన తల్లి తీరు మారలేదు. దీంతో చాలా మనస్తాపానికి గురయ్యే వాడు.

ఎస్ఐ చావా సురేశ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఏలూరు జిల్లా భీమడోలు గాంధీ బొమ్మ సెంటర్‌లో దాసరి వెంకట్ (21) నివసిస్తున్నాడు. ఆయన తాపీ కార్మికుడిగా పని చేస్తున్నాడు. చిన్నతనంలోనే తండ్రి కాలం చేయడం మూలంగా తల్లి, అతను ఇద్దరూ కలిసి ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. 

కానీ, కొన్ని సంవత్సరాలుగా తన తల్లి ఓ వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకున్నట్టు దాసరి వెంకట్‌కు తెలిసింది. ఈ విషయం తెలిసిన తర్వాత వెంకట్ చాలా బాధపడ్డాడు. తల్లిని వద్దని వారించాడు. ఎంత బ్రతిమిలాడినా.. బెదిరించినా ఆమె తన వైఖరి మార్చుకోలేదు. ఈ క్రమంలోనే శుక్రవారం దాసరి వెంకట్ పనికి వెళ్లి మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వచ్చాడు. దాసరి వెంకట్ రాకను తల్లి అంచనా వేయలేకపోయింది. దాసరి వెంకట్ ఇంటికి రాగానే అదిరిపడ్డాడు. ఇంట్లో తన తల్లి శారీరక సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కనిపించింది. దీంతో దాసరి వెంకట్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. తల్లితో గొడవకు దిగాడు.

తల్లితో గొడవ పెట్టుకున్న తర్వాత బయటకు వెళ్లాడు. ఈ బాధతో సదరు వెంకట్ మద్యం సేవించాడు. తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటిలోపలికి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. తల్లి చీరతోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొంత సేపటికే దాసరి వెంకట్ మిత్రుడు ఆనంద్ వెతుక్కుంటూ ఇంటికి వచ్చాడు. దాసరి వెంకట్ కోసం ఆయన ఇంటికి రావడంతో ఈ ఆత్మహత్య వెలుగు చూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు వెల్లడించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tourism Minister Kandula Durgesh Super Speech at Amaravati Avakaya Festival | Asianet News Telugu
IMD Rain Alert: అక్క‌డ వ‌ర్షాలు, ఇక్కడ చ‌లి.. బ‌ల‌ప‌డుతోన్న అల్ప పీడ‌నం