శ్రీకాకుళంలో దారుణం... కన్నతల్లిపై కత్తితో దాడిచేసిన కసాయి కొడుకు

Arun Kumar P   | Asianet News
Published : Oct 24, 2021, 10:33 AM ISTUpdated : Oct 24, 2021, 10:51 AM IST
శ్రీకాకుళంలో దారుణం... కన్నతల్లిపై కత్తితో దాడిచేసిన కసాయి కొడుకు

సారాంశం

నవమాసాలు కనిపెంచిన కన్నతల్లిపైనే కత్తితో దాడిచేసి హత్యాాయత్నానికి పాల్పడ్డాడు ఓ కసాయి కొడుకు. ఈ దారుణం శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.  

శ్రీకాకుళం: నవమాసాలు కనిపెంచిన తల్లిపైనే కత్తితో దాడిచేసి చంపేందుకు ప్రయత్నించాడో కసాయి కొడుకు. తన కడుపును పుట్టినవాడు అదే కడుపులో కత్తితో పొడవడంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది ఆ తల్లి. ఈ దారుణం శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... srikakulam district పాలకొండ మండలం సింగన్నవలస గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో కలహాలు రేగాయి. అయితే ఈ కలహాలకు కన్నతల్లే కారణంగా భావించిన తనయుడు దారుణానికి ఒడిగట్టాడు. నవమాసాలు కడుపున మోసి కంటికిరెప్పలా కాపాడుతూ పెంచిన తల్లిపైనే కర్కశంగా హతమార్చడానికి ప్రయత్నించాడు. కన్నతల్లిపై కత్తితో విచక్షణారహితంగా దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

read more  సిరిసిల్ల: ఆత్మహత్యకు యత్నించి... ప్రాణభయంతో కాపాడాలంటూ వేడుకున్న కరీంనగర్ వాసి

కొడుకు దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆ తల్లిని పాలకొండ ఏరియా ఆసుపత్రికు తరలించి చికిత్స అందిస్తున్నారు. కత్తితో దాడిచేయడంతో తీవ్ర రక్తస్రావం అయినట్లు... ఆమె పరిస్థితి విషమంగా వున్నట్లు డాక్టర్లు తెలిపారు.  

తల్లిపై హత్యాయత్నానికి పాల్పడిన కసాయి కొడుకు నేరుగా పాలకొండ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లిపై హత్యాయత్నానికి పాల్పడిన కొడుకుపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్