ఆస్తికోసం కన్నతల్లిని కాలితో తంతూ, కర్రతో కొడుతూ, గిన్నెతో దాడి.. ఓ కొడుకు కర్కశత్వం..

Published : Feb 19, 2022, 06:31 AM IST
ఆస్తికోసం కన్నతల్లిని కాలితో తంతూ, కర్రతో కొడుతూ, గిన్నెతో దాడి.. ఓ కొడుకు కర్కశత్వం..

సారాంశం

ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులనే దారుణంగా హింసిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాడేపల్లిలో ఓ కొడుకు ఇంటిని తన పేరు మీద రాసియ్యాలంటూ.. వృద్ధురాలైన తల్లిని కాలితో తంతూ, కర్రతో దాడిచేస్తూ దారుణానికి తెగబడ్డాడు. 

తాడేపల్లి : నవమాసాలు మోసి కనిపెంచిన motherపై కుమారుడు కర్కశంగా వ్యవహరించాడు. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి పరిధిలో బ్రహ్మానంద పురంలో చోటుచేసుకున్న ఈ దారుణం వివరాలను పోలీసులు తెలిపారు. వృద్దురాలు నాగమణి, ఆమె భర్త వెంకటేశ్వరరావుకు ఏడేళ్ల కిందట అప్పటి government land కేటాయించింది. వారు రెక్కలు ముక్కలు చేసుకుని అందులో houseని నిర్మించుకున్నారు. మూడేళ్ల కిందట కోటేశ్వర రావు చనిపోయినప్పుడు... వేరే గ్రామంలో పనిచేస్తున్న కుమారుడు శేషు.. తన భార్యతో సహా తల్లి ఇంటికి వచ్చాడు .అప్పటి నుంచి ఇక్కడే తిష్ట వేశాడు. 

వృద్ధాప్యంలో తోడు ఉంటున్నాడనుకున్న తల్లి ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. ఆస్తి కోసం నిత్యం తల్లిని కష్టపెట్టే వాడు. స్థానికులు శేషును మందలించినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాలేదు. శుక్రవారం శేషు కాలితో తన్నుతో, కర్రతో కొడుతూ, గిన్నెతో దాడి చేస్తూ... తల్లిపై విరుచుకు పడ్డాడు. కొట్టొద్దని అతని తల్లి ఎంతగా వేడుకుంటున్నా కనికరించలేదు. దాడి దృశ్యాలను స్థానికులు వీడియో తీసి వార్డు సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శేషుని అదుపులోకి తీసుకున్నారు. వృద్ధురాలికి కుమారుడితో పాటు కుమార్తె కూడా ఉంది.

కాగా, నిరుడు డిసెంబర్ 31న కడప జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓబులవారిపల్లి మండలంలో Gold jewelry కోసం తల్లిని కుమారుడు murder చేశాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని శివశంకరాపురం గ్రామానికి చెందిన రామయ్య, నరసమ్మ (47) దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు నాగరాజు liquorకి బానిసై నిత్యం కుటుంబసభ్యులతో గొడవపడేవాడు. దీంతో అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.

ఈ క్రమంలో భార్యను తిరిగి ఇంటికి రమ్మని కోరగా.. తాకట్టు పెట్టిన తన బంగారు నగలను విడిపించుకొస్తే కాపురానికి వస్తానని తేల్చి చెప్పింది. ఆ బంగారాన్ని విడిపించేందుకు నాగరాజు తన తల్లి బంగారాన్ని అడిగాడు. దానికి ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన నాగరాజు రోకలిబండతో నరసమ్మ తల మీద బాది హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

కాగా, గతనెల జనవరి 27న సంగారెడ్డిలోనూ ఇలాంటి ఘోరమే జరిగింది. సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం పోతులబొగుడ గ్రామానికి చెందిన మొండి మల్లమ్మ(55) కొడుకు మురళి వద్ద వుంటోంది. అయితే భర్త చనిపోవడంతో అతడి పేరున వున్న నాలుగు ఎకరాల భూమి మల్లమ్మ పేరిట వుంది. అంతేకాదు ఆమె వద్ద బంగారు నగలు కూడా వున్నాయి. తల్లివద్ద వున్న భూమి, బంగారంపై తాగుబోతు కొడుకు కన్ను పడింది. భూమిని తన పేర రాయాలని, బంగారు ఆభరణాలు కూడా ఇవ్వాలంటూ తాగివచ్చిన ప్రతిసారి తల్లితో గొడవకు దిగేవాడు మురళి. 

తన తదనంతరం ఆస్తులన్నీ నీకే దక్కుతాయని తల్లి చెప్పినా వినిపించుకోకుండా ఇప్పుడే వాటిని తనకు ఇవ్వాలని అడిగేవాడు. తల్లి చనిపోతే ఎలాగూ ఆస్తి తనకే దక్కుతుందని భావించిన అతడు హత్యకు ప్లాన్ వేసాడు. ముందుగానే భార్యను పుట్టింటికి పంపించిన మురళి ఇంట్లో తల్లి ఒంటరిగా వున్న సమయంలో పట్టపగలే గొంతునులిమి చంపేసాడు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్