కారు బోల్తా, ఇద్ద‌రి మృతి.. మ‌రో ముగ్గురికి తీవ్ర గాయాలు

Published : Feb 19, 2022, 06:19 AM IST
కారు బోల్తా,  ఇద్ద‌రి మృతి.. మ‌రో ముగ్గురికి తీవ్ర గాయాలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులు హాస్పిటల్ ట్రీట్ మెంట్ పొందుతున్నారు. 

కారు బోల్తా ప‌డిన ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతి చెంద‌గా మ‌రో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘ‌ట‌న చిత్తూరు జిల్లాలోని త‌మిళ‌నాడు స‌రిహ‌ద్దు ప్రాంతంలో శుక్ర‌వారం సాయంత్రం జ‌రిగింది. వివ‌రాలు ఇలా ఉన్నాయి. 

చిత్తూరు జిల్లాకు చెందిన జ‌య‌సింహ (26), ఉపేంద్ర (45) వంశీ, నాని, లోకేష్ లు ప‌ల‌మ‌నేరు ప్రాంతం నుంచి కారు వేలూరుకు తీసుకొని వెళ్తున్నారు. అయితే సైనిగుంట వ‌ద్ద‌కు చేరుకోగానే కారు అదుపుత‌ప్పి చెట్టు ను ఢీకొట్టింది. అనంత‌రం కారు బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌నలో ముందు కూర్చొని ఉన్న జ‌య‌సింహ‌, ఉపేంద్ర ఘ‌ట‌నా స్థ‌లంలోనే మృతి చెందారు. వెన‌కాల కూర్చున్న ముగ్గురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వారంతా ప్ర‌స్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. కేసు ద‌ర్యాప్తులో ఉంది. ఈ ఘ‌ట‌ను సంబంధించిన ఇంకా పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్