కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు..సోము వీర్రాజు

Published : Jan 22, 2019, 02:07 PM IST
కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు..సోము వీర్రాజు

సారాంశం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. కులాల ప్రస్తావన తెస్తున్నారని మండిపడ్డారు. అగ్రవర్ణాల మధ్య చిచ్చుపెడుతున్నారంటూ విమర్శించారు.

కాపులను బీసీల్లో చేర్చుతామంటూ చంద్రబాబు వివాదం సృష్టిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకి ఇప్పుడే ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే రాష్ట్రంలో ఉండకుండా దేశమంతా తిరుగుతున్నారని అభిప్రాయపడ్డారు. అవినీతికి పాల్పడే వ్యక్తులే ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్నారని అబిప్రాయపడ్డారు.

కేంద్రం ఏపీకి 10లక్షల ఇళ్లు మంజూరు చేస్తే.. ఇప్పటివరకు కేవలం 2లక్షల ఇళ్లే నిర్మించారన్నారు. ఎన్నికలు దగ్గరపడేసరికి పథకాల పేరిట ప్రజలకు తాయిలాలు అందిస్తున్నారని మండిపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!