పులివెందులలో క్షుద్రపూజలు..?

Published : Jan 22, 2019, 01:53 PM IST
పులివెందులలో క్షుద్రపూజలు..?

సారాంశం

పులివెందులలో క్షుద్రపూజల కలకలం రేపాయి.  పట్టణ పరిధిలోని భాకరాపురం సమీపంలోని పంట పొలాల్లో క్షుద్ర పూజలు చేస్తున్నారని రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. 

పులివెందులలో క్షుద్రపూజల కలకలం రేపాయి.  పట్టణ పరిధిలోని భాకరాపురం సమీపంలోని పంట పొలాల్లో క్షుద్ర పూజలు చేస్తున్నారని రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రింగ్‌ రోడ్డు, హెలీప్యాడ్‌ ప్రాంతాల్లో గుర్తు తెలియని ఆకతాయిలు మద్యం సేవించి వీరంగం సృష్టిస్తున్నారని చెబుతున్నారు.

పచ్చటి పొలాల్లో మద్యం తాగుతూ పంటలను నాశనం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.    పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడంలేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్