దుర్గమ్మ వెండి రథం సింహాల ప్రతిమల అదృశ్యంపై వాస్తవాలు చెప్పాలి: సోము వీర్రాజు

By narsimha lode  |  First Published Sep 16, 2020, 10:50 AM IST

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ వెండి రథానికి చెందిన మూడు సింహాలు అదృశ్యమైన ఘటనపై వాస్తవాలను ప్రజలకు వివరించాలని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. 


అమరావతి: విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ వెండి రథానికి చెందిన మూడు సింహాలు అదృశ్యమైన ఘటనపై వాస్తవాలను ప్రజలకు వివరించాలని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. 

విజయవాడ దుర్గగుడిలో రథాన్ని బీజేపీ నేతలు బుధవారం నాడు పరిశీలించారు. రథం గురించి వివరాలను ఈవో సురేష్ బాబును బీజేపీ నేతలు అడిగి తెలుసుకొన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

Latest Videos

undefined

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ వెండి రథానికి చెందిన సింహాల ప్రతిమలు మాయమయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. దుర్గమ్మ  రథంపై నాలుగో సింహాన్ని కూడ తొలగించేందుకు యత్నించారని ఆయన ఆరోపించారు. 

ఈ సింహాల ప్రతిమలు లాకర్ లో ఉన్నాయేమోనని ఈవో తనకు చెప్పే ప్రయత్నం చేశారన్నారు. లాకర్ లో ఈ సింహాల ప్రతిమలు ఎందుకు ఉంటాయన్నారు. ఈ విషయంలో దాపరికం ఉండకూడదని ఆయన కోరారు.

ఈ విషయమై విచారణకు ఆదేశించినట్టుగా ఈవో సురేష్ బాబు చెప్పారు. ఈ రథంపై మూడు సింహాల ప్రతిమలున్నాయా...ఎన్ని ఉన్నాయనే విషయాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వనున్నట్టుగా ఈవో ప్రకటించారు. ఈ విషయంలో సెక్యూరిటీ లోపం ఉందని తేలితే చర్యలు తీసుకొంటామని ఈవో హెచ్చరించారు.

click me!