రాష్ట్రంలో సర్జికల్ సైకాలజికల్ గేమ్ నడుపుతాం.. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు..

By Sumanth KanukulaFirst Published Sep 18, 2022, 12:21 PM IST
Highlights

మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ కాలక్షేపం చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. రాజధాని పేరుతో రైతులను టీడీపీ, వైసీపీలు రోడ్డున పడేశాయని ఆరోపించారు. 

మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ కాలక్షేపం చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. రాజధాని పేరుతో రైతులను టీడీపీ, వైసీపీలు రోడ్డున పడేశాయని ఆరోపించారు. రూ. 7వేల కోట్లు ఖర్చు పెడితే రాజధాని ఏమైందని రెండు పార్టీలను ప్రశ్నించారు. రాష్ట్ర పునర్విభజన తర్వాత అన్ని జిల్లాల అభివృద్ది కోసం ఆలోచించింది బీజేపీ మాత్రమేనని చెప్పారు. రాష్ట్రంలో సైకాలజికల్ గేమ్ నడుస్తోందని అన్నారు. తాము సైకాలజికల్ గేమ్ నడుపుతామని చెప్పారు. తాము సర్జికల్ సైకాలజికల్ గేమ్ మొదలుపెడతామని తెలిపారు. 

సర్జికల్స్ ఏమిటంటే.. 50 లక్షల మంది రైతులు, 90 లక్షల మందికి బియ్యం ఇవ్వడం, లక్షలాది మందికి మధ్యాహ్న భోజనం పథకం పెట్టడం, లక్షలాది మందికి పౌష్టికాహారం ఇవ్వడం అని చెప్పారు. బలమైన సంక్షేమ ఆలోచనలు పార్టీ బీజేపీ అని చెప్పారు. యూపీలో ఎస్పీ, బీఎస్పీ పార్టీల మాదిరిగానే.. ఏపీలో వైసీపీ, టీడీపీలు వాష్ అవుట్ అవ్వడం ఖాయమని చెప్పారు. 

వైసీపీ, టీడీపీ డ్రామా పార్టీలు అని మండిపడ్డారు. రాజధాని అనేది సైలంట్ ఫ్యుచర్ అని అన్నారు. భూములిచ్చిన రైతులను రోడ్డున పడేస్తారా? అని మండిపడ్డారు. ఏపీలో రూలింగ్ కంటే ట్రేడింగ్ ఎక్కువ జరుగుతుందని విమర్శించారు. 

click me!