మోదీని తిట్టమని జగన్, పవన్ లకు ఆయన ఎలా చెప్తారు

By Nagaraju TFirst Published Dec 31, 2018, 5:09 PM IST
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విరుచుకుపడ్డారు. విజయనగరం జిల్లాలో పర్యటించిన సోము చంద్రబాబుకు మతి భ్రమించిందని ఆరోపించారు. కేసీఆర్ నరేంద్రమోదీ ఒక్కరే అంటున్నారని, పవన్, జగన్ ఇద్దరూ మోడీలే అంటున్నారని అసలు మెదడు పనిచేస్తుందా లేదా అని ప్రశ్నించారు.

విజయనగరం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విరుచుకుపడ్డారు. విజయనగరం జిల్లాలో పర్యటించిన సోము చంద్రబాబుకు మతి భ్రమించిందని ఆరోపించారు. కేసీఆర్ నరేంద్రమోదీ ఒక్కరే అంటున్నారని, పవన్, జగన్ ఇద్దరూ మోడీలే అంటున్నారని అసలు మెదడు పనిచేస్తుందా లేదా అని ప్రశ్నించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్రమోదీ అలాంటప్పుడు కేసీఆర్ మోదీ ఎందుకు అవుతారో చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్, జగన్ ఎందుకు మోడీలు అవుతారని ప్రశ్నించారు. 
చంద్రబాబు 100 ధృతరాష్ట్రులతో సమానం అని విమర్శించారు. 

అధికారం కోసం సోంతమామనే వెన్నుపోటు పోడిచిన చవకబారు రాజకీయవేత్త చంద్రబాబు నాయుడు అంటూ ధ్వజమెత్తారు. రాజకీయాల్లో ఉండటానికి చంద్రబాబు అనర్హుడంటూ విమర్శించారు. నిన్నటి వరకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఇష్టం వచ్చినట్లు తిట్టి, నరేంద్రమోదీని ప్రశంసిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన చంద్రబాబు ఈరోజు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. 


జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ లను మోడిని తిట్టమని చంద్రబాబు ఏలా అడుగుతారని నిలదీశారు. రాష్ట్రంలో పరిపాలన అగమ్య గోచరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.700 కోట్లు ఇస్తామన్న యూసిలు ఇవ్వలేని దుస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వ హాస్టల్లో వసతులు లేక నరకం చూస్తున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు విడుదల చేసేవి శ్వేతపత్రాలా లేక అవినీతి పత్రాలా అంటూ ప్రశ్నించారు. 

గ్రామాల స్వయం సమృద్ధికి మోదీ బాటలు వేశారని గుర్తు చేశారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద వేల కోట్లు ఇచ్చిందని సోము వీర్రాజు చెప్పారు. చంద్రబాబు నాయుడు కేంద్రం ఇచ్చిన నిధులతో కాకుండా సొంత నిధులతో ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని 

అభివృద్ధి చేసింది మోదీ అయితే రాష్ట్రాన్ని అవినీతిమయం చేసింది చంద్రబాబు అంటూ విరుచుకుపడ్డారు. చెరువులలో మట్టి తవ్వడానికి రూ.16 వేల కోట్లు రూపాయలు ఖర్చుపెడతారా అంటూ ప్రశ్నించారు. అన్ని కోట్ల రూపాయలు పెట్టి చెరువులు తవ్వితే  అనంతపురంలో కరువు ఏలా వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. కమ్యూనిస్ట్ లను  సైతం చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. 

click me!