తెలుగు ప్రజలకు పవన్ న్యూ ఇయర్ విషెస్

Published : Dec 31, 2018, 04:32 PM IST
తెలుగు ప్రజలకు పవన్ న్యూ ఇయర్ విషెస్

సారాంశం

తెలుగు రాష్ట్రాల ప్రజలకు జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు జనసేన తరపు నుంచి ఓ పత్రికా ప్రకటనను కూడా పవన్ విడుదల చేశారు.

‘‘ కొత్త ఆశలకు ఊపిరిపోస్తూ 2019లోకి అడుగుపెడుతున్న తరుణంలో తెలుగు ప్రజలందరికీ నా తరపున, జనసేన సైనికుల తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడిచిన ఏడాది అనుభవాలను ప్రేరణగా తీసుకొని.. నూతన నిర్ణయాలతో ముందడుగు వేద్దాం. ఈ కొత్త సంవత్సరంలో సామాన్యుడు రాజై వెలగాలని.. మానవీయ  పాలనకు, నవ చరితకు ఇది శ్రీకారం కావాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ పవన్ పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

BR Naidu Press Meet: దేశం లోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తిరుపతి స్విమ్స్: బీఆర్ నాయుడు| Asianet Telugu
Swathi Deekshith & Pranavi Manukonda Visit Tirumala Temple: శ్రీవారిసేవలో ప్రముఖులు | Asianet Telugu