మా విధానం ఒకే రాజధాని.. అది అమరావతే.. ప్రాంతీయ పార్టీలతో ఏపీ నష్టపోయింది: సోము వీర్రాజు

Published : Jan 22, 2023, 12:41 PM IST
మా విధానం ఒకే రాజధాని.. అది అమరావతే.. ప్రాంతీయ పార్టీలతో ఏపీ నష్టపోయింది: సోము వీర్రాజు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో బీజేపీ వైఖరిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి స్పష్టతనిచ్చారు. తమ విధానం ఒకే రాజధాని అని.. అది అమరావతేనని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో బీజేపీ వైఖరిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి స్పష్టతనిచ్చారు. తమ విధానం ఒకే రాజధాని అని.. అది అమరావతేనని తెలిపారు. రాజధాని కోసం కేంద్రం వేల కోట్లు నిధులు కేంద్రం ఇచ్చిందని.. ఆ డబ్బు ఖర్చు పెట్టకుండా ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా సోము వీర్రాజు విశాఖలో పర్యటిస్తున్నారు. ఆదివారం విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. కుటుంబ పార్టీలు రాజధానిపై కాలక్షేపం చేస్తున్నాయని విమర్శించారు. 

అధికారంలోకి రాకముందు సీఎం జగన్ ఆరేళ్లు రోడ్లపై నడిచారని.. అయితే ఇప్పుడు మాత్రం ప్రతిపక్షాలను రోడ్డెక్కనివ్వకుండా జీవో తీసుకొచ్చారని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. కేంద్రం అభివృద్ధి చేస్తుంటే ఇతర పార్టీలు రాజకీయాలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో తాము చేస్తున్న అభివృద్ధి గురించి చెపుతున్నామని.. ఇతర రాజకీయపార్టీలు కేవలం హడావిడి చేస్తున్నాయని విమర్శించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు