ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ఇవాళ ఉదయం ప్రారంభమయ్యాయి. నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్ధులను అనుమతించలేదు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలు ఆదివారం నాడు ఉదయం 10 గంటల కు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 997 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షలకు హాజరయ్యేందుకు అభ్యర్ధులను నిరాకరిస్తున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నంమ 1 గంట వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుండే పరీక్షా కేంద్రంలోకి అభ్యర్ధులను అనుమతిస్తారు. నిర్ధేశించిన సమయం కంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అభ్యర్ధులను అనుమతించడం లేదు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అభ్యర్ధులు పరీక్ష రాయలేకపోయారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అభ్యర్ధికి అధికారులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్టణంలో ముగ్గురు , ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరులో ముగ్గురు అభ్యర్ధులు ఆలస్యంగా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు.ఆలస్యంగా పరీక్షా కేంద్రాలకు చేరుకున్న అభ్యర్ధులను పరీక్ష రాసేందుకు అభ్యర్ధులు అనుమతించలేదు.
undefined
రాష్ట్రంలోని 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఇవాళ రాత పరీక్ష నిర్వహిస్తున్నారు.ఈ నెల 7వ తేదీ నుండి ఈ పరీక్షలకు ధరఖాస్తులను స్వీకరించారు. ఈ పరీక్షల కోసం 5,03,486 మంది అభ్యర్ధులు ధరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3,95,415 మంది పురుషులు, 1,08, 071 మంది మహిళా అభ్యర్ధులున్నారు.
ఈ పరీక్షలను ఇంగ్లీష్ లో రాసేందుకు గాను 1,39,075 మంది ధరఖాస్తు చేసుకున్నారు. 277 మంది అభ్యర్ధులు ఉర్తూలో పరీక్ష రాసేందుకు ధరఖాస్తు చేసుకున్నారు. 3,64, 184 మంది అభ్యర్ధులు తెలుగులో పరీక్షలు రాయనున్నారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల తర్వాత ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇటీవలనే తెలంగాణ రాష్ట్రంలో కూడా కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల నియామాకాలకు సంబంధించి రాత పరీక్షలు, ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించారు.