మోహన్ బాబుతో సోము వీర్రాజు భేటీ.. ఆ విషయంలో మద్దతు కోసమే..!!

Published : Mar 11, 2023, 02:18 PM IST
మోహన్ బాబుతో సోము వీర్రాజు భేటీ.. ఆ విషయంలో మద్దతు కోసమే..!!

సారాంశం

ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబుతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ అయ్యారు. తిరుపతిలోని మోహన్ బాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. 

ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబుతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ అయ్యారు. తిరుపతిలోని మోహన్ బాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని మోహన్‌ బాబును సోము వీర్రాజు ఈ సందర్భంగా కోరారు. అయితే బీజేపీ అభ్యర్థులకు మోహన్ బాబు మద్దతు ప్రకటిస్తారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. 

అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో మోహన్ బాబు తనదైన నటనతో కలెక్షన్ కింగ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత చంద్రబాబుతో విభేదాలతో టీడీపీకి దూరం అయ్యారు. మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు.. వైఎస్సార్ సోదరుడి కూతురు వెరానికాను పెళ్లి చేసుకోవడంతో ఆ కుటుంబంతో బంధుత్వం ఏర్పడింది. అయితే  2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన విద్యాసంస్థలకు టీడీపీ ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదని మోహన్ బాబు చేపట్టిన నిరసన తీవ్ర సంచనలంగా మారింది. ఆ సమయంలో టీడీపీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. 

అయితే 2019 ఎన్నికల తర్వాత మోహన్ బాబు యాక్టివ్‌ పాలిటిక్స్‌లో కనిపించలేదు. ఆ తర్వాత కొంతకాలానికి మోహన్ బాబు తన కుటుంబంతో కలిసి ప్రధాని మోదీని కలిశారు. దీంతో మోహన్ బాబుకు, వైసీపీలకు మధ్య సత్సబంధాలు దెబ్బతిన్నాయనే ప్రచారం కూడా సాగింది. మరోవైపు గతేడాది మోహన్ బాబు.. చంద్రబాబు  నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కావడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత కొన్ని ఇంటర్యూల్లో మాట్లాడిన ఆయన తాను ఏ పార్టీలో లేనని ప్రకటించారు. అయితే కొంతకాలంగా మోహన్ బాబు చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీకి మద్దతుగా ఉన్నాయనే వాదన ఉంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి నిరసన చేపట్టారనే కేసుకు సంబంధించి తిరుపతి కోర్టుకు హాజరైన సమయంలో మోహన్ బాబు మాట్లాడుతూ.. తాను బీజేపీ మనిషినని వ్యాఖ్యానించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్