ఈవో వేధింపులు: ద్వారకా తిరుమలలో ఉద్యోగుల మూకుమ్మడి సెలవులు

By narsimha lodeFirst Published Aug 13, 2021, 10:39 AM IST
Highlights

ప.గో జిల్లా ద్వారకా తిరుమలలో ఈవో పై చర్యలు తీసుకోవాలని కోరుతూ  ఉద్యోగుల మూకుమ్మడిగా సెలవులు పెట్టారు.
ఏఈఓ రామాచారి మృతికి నిరసనగా ఉద్యోగులంతా సెలవులు పెట్టి  నిరసనకు దిగారు.

ఏలూరు:పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల ఆలయ ఉద్యోగులు మూకుమ్మడిగా సెలవులు పెట్టి నిరసనకు దిగారు. ఈవో వేధింపుల కారణంగానే  ఏఈఓ రామాచారి మరణించాడని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.,

నిన్న ఏఈఓ రామాచారి గుండెపోటుతో మరణించాడు.  ఈవో వేధింపుల కారణంగానే మరణించాడని  ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. రామాచారి మృతికి కారణమైన ఈవోపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆలయంలో పనిచేసే ఉద్యోగులంతా మూకుమ్మడిగా సెలవులు పెట్టారు.

సెలవులు పెట్టిన ఉద్యోగులంతా ఆలయంలోనే నేలపై కూర్చోని నిరసనకు దిగారు. ఈవో వేధింపుల కారణంగానే ఈ ఘటనలు చోటు చేసుకొంటున్నాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈవోపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఈవోపై చర్యలు తీసుకొనేంతవరకు తమ ఆందోళన కొనసాగుతుందని  ప్రకటించారు.ద్వారకా తిరుమల ఆలయం ఎంతో ప్రసిద్ది చెందింది. ఈ ఆలయంలో ఉద్యోగులంతా మూకుమ్మడిగా సెలవులపై వెళ్లడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు.

ఈవో తీరుపై కొంత కాలంగా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ విషయమై దేవాదాయశాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.
 


 

click me!