నోట్లో గుడ్డలు కుక్కి... తొమ్మిదేళ్ల చిన్నారిపై 14ఏళ్ల బాలుడు అత్యాచారం

Arun Kumar P   | Asianet News
Published : Aug 13, 2021, 09:33 AM IST
నోట్లో గుడ్డలు కుక్కి... తొమ్మిదేళ్ల చిన్నారిపై 14ఏళ్ల బాలుడు అత్యాచారం

సారాంశం

అభం శుభం తెలియని పదేళ్ల చిన్నారిపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడో మైనర్ బాలుడు. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. 

కడప: కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ మైనర్ బాలుడు నిండా పదేళ్లు కూడా నిండని చిన్నారిపై అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్రామ శివారులో ఒంటరిగా కనిసించిన చిన్నారిని పొదల్లోకి ఎత్తుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ అమానుషం కడప జిల్లాలో చోటుచేసుకుంది. 

బాధిత కుటుంబం, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కడప జిల్లా చక్రాయపేటకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక స్కూల్ కు సెలవులు కావడంతో ఇంటివద్దే వుంటోంది. తల్లిదండ్రులకు చిన్న చిన్న పనుల్లో సాయం చేసేది. ఇలాగే ఈ కుటుంబం పెంచుకునే చిన్న మేకపిల్ల చనిపోవడంతో దాన్ని ఊరిబయట పడేయడానికి చిన్నారి బాలిక వెళ్లింది.

read more  వెలుగు వాట్సాప్ గ్రూప్ లో.. పోర్న్ వీడియో కలకలం..!

అయితే బాలిక ఒంటరిగా వెళుతుండటాన్ని గమనించిన 14ఏళ్ల మైనర్ బాలుడు దారుణానికి ఒడిగట్టాడు. బాలికను అనుసరించిన అతడు గ్రామ శివారులో నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లగానే లైంగిక దాడికి తెగబడ్డాడు. చిన్నారి బట్టలు చించి వాటినే అరవకుండా నోట్లో కుక్కి అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అసలేం జరుగుతుందో తెలియని ఆ చిన్నారి కామాంధుడి చేతిలో నలిగిపోయింది. 

బాలిక ఎంతసేపటికి తిరిగిరాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వెళ్లిచూడగా నగ్నంగా పడివుంది. ఆమెను ఇంటికి తీసుకువచ్చి అడగ్గా తనపై జరిగిన అఘాయిత్యం గురించి బయటపెట్టింది. దీంతో తల్లిదండ్రులు చక్రాయిపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితుడి కోసం గాలిస్తున్నారు.


 

PREV
click me!

Recommended Stories

Bhumana Karunakar Reddy: కూటమి పాలనలో దిగ‌జారుతున్న తిరుమ‌ల ప్ర‌తిష్ట | TTD | Asianet News Telugu
పోలవరం, అమరావతి మాటల్లోనే.. చేతల్లో శూన్యంPerni Nani Slams Alliance Government | Asianet News Telugu