చంద్రబాబు మనుషుల జేబుల్లోకి డబ్బులు: సోము వీర్రాజు

By pratap reddyFirst Published Dec 1, 2018, 2:43 PM IST
Highlights

తాత్కాలిక రాజధాని పేరుతో చంద్రబాబు వేయి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని సోము వీర్రాజు ఆరోపించారు. నీరు - చెట్టు పేరుతో 1.04 లక్షల కోట్ల ధనాన్ని పక్కదారి పట్టించారని విమర్శించారు.

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై బిజెపి నేత సోము వీర్రాజు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కోట్లాది రూపాయల మైనింగ్ జరుగుతున్నా రాష్ట్రానికి ఆదాయం రావడం లేదని, ఆ డబ్బులన్నీ చంద్రబాబు అనుచరుల జేబుల్లోకి వెళ్తున్నాయని ఆయన అన్నారు. 

తాత్కాలిక రాజధాని పేరుతో చంద్రబాబు వేయి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని సోము వీర్రాజు ఆరోపించారు. నీరు - చెట్టు పేరుతో 1.04 లక్షల కోట్ల ధనాన్ని పక్కదారి పట్టించారని విమర్శించారు. ఇసుక, మట్టి, లాటరైట్, బాక్సైట్ వంటివాటిని అన్నింటినీ దోచుకుంటున్నారని ఆయన అన్నారు.

ఓటమి భయంతోనే చంద్రబాబు తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని ఆయన అన్నారు వచ్చే ఎన్నికల్లో తమ బిజెపి 175 అసెంబ్లీ స్థానాల్లో, 25 లోకసభ స్థానాల్లో పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. 

కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, అటువంటి కాంగ్రెసు పార్టీతోనే చంద్రబాబు చేతులు కలిపారని ఆయన అన్నారు ప్రభుత్వ సొమ్ముతో చంద్రబాబు దీక్షలు చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలను అణచివేస్తున్నారని ఆయన విమర్శించారు.

click me!