రామతీర్థంలో సోము వీర్రాజు అరెస్ట్

By AN TeluguFirst Published Jan 5, 2021, 10:50 AM IST
Highlights

ఏపీలో విగ్రహా విధ్వంస ఘటనలు రోజురోజుకూ ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. విజయనగరంజిల్లాలో కోదండరామస్వామి విగ్రహ ధ్వంసం ఘటనకు నిరసనగా బీజేపీ, జనసేన రామతీర్థ ధర్మయాత్ర తలపెట్టింది. ఈ యాత్ర ఉద్రిక్తంగా మారింది. 

ఈ కార్యక్రమలో పాల్గొనేందుకు నేతలు సిద్ధమవుతుండగా, ఇప్పటికే కొందరిని పోలీసులు గృహనిర్భంధం చేశారు. రామతీర్థం సందర్శనకు వెళ్లకుండా స్థానిక రామతీర్థం కూడలి వద్ద భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అడ్డుకున్నారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని పోలీసులు ఆదేశించారు. 

ఇందులో భాగంగానే సోము వీర్రాజుతోపాటు పలువురు భాజపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. 

click me!