రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పిన సోము వీర్రాజు.. ఆయన ఎమన్నారంటే..

Published : Jan 29, 2022, 09:26 AM IST
రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పిన సోము వీర్రాజు.. ఆయన ఎమన్నారంటే..

సారాంశం

రాయలసీమ (Rayalaseema) జిల్లాల్లో ఎయిర్‌పోర్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (somu veerraju) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే సోము వీర్రాజు.. సీమ ప్రజలకు క్షమాపణలు చెప్పారు.

రాయలసీమ (Rayalaseema) జిల్లాల్లో ఎయిర్‌పోర్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (somu veerraju) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హత్యలు చేసిన వారి జిల్లాలకు ఎయిర్‌పోర్టులా అంటూ సోమువీర్రాజు వ్యాఖ్యానించడంపై పెద్ద ఎత్తున రాయలసీమ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సోము వీర్రాజు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పరిస్థితుల్లో మార్పు కనిపించలేదు. నోరు అదుపులో పెట్టుకోవాలని సీమ నేతలు సోము వీర్రాజును హెచ్చరించారు. ఈ క్రమంలోనే సోము వీర్రాజు తన మాటలపై వెనక్కి తగ్గారు. ఈ క్రమంలోనే రాయలసీమ ప్రజలకు సోము వీర్రాజు క్షమాపణలు చెప్పారు. 

తాను వాడిన పదాలతో రాయలసీమ ప్రజల మనసులు గాయపడ్డాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే క్రమంలో ఆ వ్యాఖ్యాలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. తన మాటలతో నొచ్చుకున్నవారికి క్షమాపణలు చెప్పారు. తాను వాడిన పదాలను వెనక్కి తీసుకుంటున్నానని తెలిపారు. ఈ మేరకు somu veerraju ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 

‘రాయలసీమ రతనాల సీమ.. ఈ పదం నాహృదయం లో పదిలం. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును విమర్శించే విషయంలో వాడిన పదాల వల్ల రాయలసీమ ప్రజలు మనసులు గాయపడ్డాయి. ఈ పదాలను వాపసు తీసుకుంటున్నాను. ఈ విషయంలో క్షమాపణలు చెబుతున్నాను. నేను నిరంతరం రాయలసీమ అభివృద్ధి విషయంలో అనేక వేదికలపై ప్రస్తావిస్తూ వస్తున్న విషయం ఆ ప్రాంత వాసులకు తెలుసు. రాయలసీమకు నికర జలాలు, పెండింగ్ ప్రాజెక్టుల విషయాలను అనేక సందర్భాల్లో ప్రస్తావించాను. రాయలసీమ అభివృద్ధి ఇంకా వేగవంతం కావాలని భారతీయ జనతా పార్టీ ఆలోచన’ అని సోము వీర్రాజు పేర్కొన్నారు. 

ఇక, విశాఖలో సోము వీర్రాజు గురువారం విశాలో మాట్లాడుతూ.. ప్రాణాలు తీసేసే వారి జిల్లాలో కూడా ఎయిర్‌పోర్టులా అంటూ వ్యాఖ్యానించారు. దీంతో తీవ్ర దుమారం రేగింది. సోము వ్యాఖ్యలపై రాయలసీమ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోము వీర్రాజు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే వివాదానికి ముగింపు పలకాలని భావించిన సోము వీర్రాజు.. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. వివేకా హత్యను దృష్టిలో వుంచుకునే తాను అలా మాట్లాడానని ఆయన అన్నారు. కడప ప్రజలకు హత్యా రాజకీయాలకు సంబంధం లేదని సోము వీర్రాజు పేర్కొన్నారు. అయినప్పటికీ వివాదం సద్దుమణగకపోవడంతో తాజాగా సోము వీర్రాజు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!