కేంద్ర, రాష్ట్రాలు కలిసి... ప్రజలకు అందిస్తున్న కరోనా కానుకదే: సోమిరెడ్డి ఎద్దేవా

By Arun Kumar PFirst Published Jun 27, 2020, 12:59 PM IST
Highlights

 ఇంధన చార్జీల పెంపుపై శుక్రవారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. 

గుంటూరు: ఇంధన చార్జీల పెంపుపై శుక్రవారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. కరెంట్ చార్జీల విషయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్  పప్పులో కాలేసినట్టున్నారని... అందువల్లే కేంద్రం రూ.2.70కే కరెంట్ ఇస్తుంటే ఏపీలో రూ.9 వసూలు చేస్తున్నారన్నారని అన్నారన్నారు. కానీ వైసిపి ప్రభుత్వం రూ.9కి కాదు రూ.9.95 వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇది బహుశా కరోనా కానుకేమో అంటూ వైసిపి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.  

''పెట్రో ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో రూ.30 ఉండగా కేంద్రం ఒక రూ.25, రాష్ట్రం మరో రూ.30కి పైగా పన్ను వేసి రూ.85 చేశారు. కరోనా కష్ట కాలంలో రూ.10 పెంచడం ఎంతవరకు న్యాయం. గతంలో ప్రజల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని టీడీపీ ప్రభుత్వం రూ.2 వరకు పన్ను భారం తగ్గించింది.  ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు ఈ సమయంలో పోటీపడి పన్నుల భారం పెంచుకుంటూ పోవడం దురదృష్టకరం'' అని సోమిరెడ్డి మండిపడ్డారు. 

read more    ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్: ఒకరి మృతి, మరింత మందికి అస్వస్థత

శుక్రవారం ఢిల్లీలోని బిజెపి కేంద్రకార్యలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ జన సంవాద్ వర్చువల్ ర్యాలీ బహిరంగ సభలో కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలోనే ఆమె వైసిపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

''కేంద్రం ఒక స్థాయిలో 2.70పైసలకు పవర్ ఇస్తున్నా ఎపీలో తొమ్మిది రూపాయలు ఛార్జీ చేయడం విని ఆశ్చర్యపోయాను. తొమ్మిది రూపాయలు ఇచ్చి పరిశ్రమలను నడపడం సాధ్యమేనా అనేది కూడా ఆలోచించాలి..90వేల కోట్లను కరెంట్ వినియోగం చేసే కంపెనీల కోసం కేటాయించి  సరిచేసుకోవాలని కోరాం'' అని ఆర్ధికమంత్రి వెల్లడించారు. 

''ఎఫ్ఆర్‌బిఎమ్ యాక్టు ద్వారా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పరిమిత స్థాయిలోనే అప్పులు తీసుకోవాలి. కరోనా కష్టకాలంలో ఇటువంటి నిబంధనలు సడలించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అవకాశం ఇచ్చాం. ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలను అందించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలి. రేషన్ కార్డు దేశంలో ఎక్కడ ఉన్నా వినియోగించే అవకాశం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. వలస కార్మికులు పని చేస్తున్న రాష్ట్రాలలో  రేషన్ తీసుకునే అవకాశం లేకే ఇబ్బందులు పడ్డారు.దేశంలోని అన్ని రాష్ట్రాలు అన్ని విధాలా అభివృద్ది చెందాలనే మోడీ మాకు చెప్పారు'' అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 


 

click me!