తుఫాన్ తాకిడి ప్రాంతాల్లో బైక్ పై నారా లోకేష్ పర్యటన

By Nagaraju TFirst Published Oct 13, 2018, 8:31 PM IST
Highlights

తిత్లీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. మందస మండలం హరిపురంతో పాటు ఉద్దానం గ్రామాల్లో ఎంపీ రామ్మోహన్‌ నాయుడుతో కలిసి బైక్‌పై తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. 
రట్టి గంగవాడ, ఎం గొంగాడ, చిన్నబిడం, బాహడ పల్లె, సువర్ణపురం గ్రామాల్లో పర్యటించిన లోకేష్ బాధితులు, రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను విన్నారు. 
 

శ్రీకాకుళం: తిత్లీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. మందస మండలం హరిపురంతో పాటు ఉద్దానం గ్రామాల్లో ఎంపీ రామ్మోహన్‌ నాయుడుతో కలిసి బైక్‌పై తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. 
రట్టి గంగవాడ, ఎం గొంగాడ, చిన్నబిడం, బాహడ పల్లె, సువర్ణపురం గ్రామాల్లో పర్యటించిన లోకేష్ బాధితులు, రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను విన్నారు. 

అలాగే తుఫాన్ ధాటికి పాడైన జీడి, మామిడి తోటలను పరిశీలించారు. కుప్పకూలిన కొబ్బరిచెట్లను పరిశీలించారు. తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయామని తమను ఆదుకోవాలని బాధితులు లోకేశ్‌ను కోరారు. మందస, ఉద్దానం గ్రామాల్లో తాగునీరులేక ఇబ్బందలు పడుతుండటం గమనించిన లోకేష్  తాగునీటి సరఫరా, రోడ్ల మరమ్మతులు, పారిశుద్ధ్యం పనులు వేగవంతం అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 

అలాగే విద్యుత్ పునరుద్ధరణ ఆలస్యం అవ్వనున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిసారించారు. విద్యుత్ పునరుద్ధరణ అయ్యే లోపు ఇతర జిల్లాల నుంచి వీలైనన్ని జనరేటర్లు సమీకరించాలని సూచించారు. గ్రామాల్లో చెత్త తొలగింపు, పారిశుధ్యం పనుల కోసం ఇతర జిల్లాల నుండి ప్రత్యేక బృందాలను రప్పించాలని ఆదేశించారు.

మరోవైసే భేతాళపురం గ్రామంలో  తుఫాను సమయంలో చెట్టు మీద పడి చనిపోయిన అప్పలస్వామి కుటుంబసభ్యులను మంత్రి లోకేష్ పరామర్శించారు. మృతిచెందిన అప్పలస్వామి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అధైర్యపడొద్దని తమ ప్రభుత్వం అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.  

click me!