మంగళగిరి సాప్ట్ వేర్ యువతి జగ్గయ్యపేటలో అనుమానాస్పద మృతి... ఆత్మహత్యా లేక హత్యా?

By Arun Kumar PFirst Published Jul 3, 2022, 10:46 AM IST
Highlights

హైదరాబాద్ కని బయలుదేరిన సాప్ట్ వేర్ యువతి ప్రాణాలు కోల్పోయి చెరువులో శవంగా తేలిన దుర్ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో చోటుచేసుకుంది.  

విజయవాడ : ఉద్యోగంలో చేరడానికి హైదరాబాద్ వెళుతున్నానని చెప్పి ఇంట్లోంచి బయలుదేరిన సాప్ట్ వేర్ ఉద్యోగిని అనుమానాస్పద రీతిలో చెరువులో మృతదేహంగా తేలింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసకుంది. 

వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నపులూరుకు చెందిన శ్వేత (22) ఇంజనీరింగ్ పూర్తిచేసింది. ఇటీవలే హైదరాబాద్ కు చెందిన ఓ సాప్ట్ వేర్ కంపనీలో ఉద్యోగం సంపాందించింది. ఉద్యోగంలో చేరి గత మూడు నెలలుగా ఆమె వర్క్ ఫ్రమ్ హూం చేస్తోంది. అయితే కరోనా కేసులు తగ్గడం, ప్రభుత్వ ఆంక్షల సడలింపుతో ఒక్కోటిగా కంపనీలు ఆఫీసుల నుండే కార్యకలాపాలు ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఇలా శ్వేత పనిచేసే కంపనీ కూడా ఉద్యోగులు ఆఫీస్ కు వచ్చి పని చేయాల్సిందిగా ఆదేశించింది. 

ఇలా ఆఫీస్ నుండి సమాచారం రావడంతో శ్వేత శనివారం సాయంత్రం హైదరాబాద్ కు బయలుదేరింది. ఇంట్లోవాళ్లకు చెప్పి సాయంత్రం ఐదుగంటలకు బయటకు వచ్చింది. అయితే రాత్రి 8గంటల సమయంలో శ్వేత మొబైల్ నంబర్ నుండి తల్లికి  ఓ వాట్సాప్ వాయిస్ మెసేజ్ వచ్చింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ కూతురి వాయిస్ మెసేజ్ విని కంగారుపడిపోయిన తలిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో పోలీసులు సాంకేతికతను ఉపయోగించి యువతి ఆఛూకీ  కనుక్కున్నారు.

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు వద్ద ఓ చెరువులో యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. స్థానికుల సాయంతో యువతి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాప్ట్ వేర్ ఇంజనీర్ శ్వేతది ఆత్మహత్యా లేక మరేదయిన జరిగిందా అన్నకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఉద్యోగంలో చేరడానికి బయలుదేరిన కూతురు తిరిగి విగతజీవిగా ఇంటికి చేరడంతో ఆ తల్లీదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. కూతురిని తలచుకుని ఆ తల్లిదండ్రులు పడుతున్న వేదన చూసేవారికీ కన్నీరు తెప్పిస్తోంది. 
 

click me!