
శృంగవరపుకోట : ‘మీ ఇంటికి ఫోన్ చేసి రూ. 50 లక్షలు తెమ్మని చెప్పాలంటూ తీవ్రంగా కొట్టారు. సొమ్ము తేకుంటే మా సార్ కు అప్పగిస్తామని, ఆయన నీ శరీర అవయవాలు అమ్మేస్తాడు అని భయపెట్టారు. ఇంతలో ఉద్యోగి కేకలు వేయడంతో స్థానికులు విని, దుండగులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఎస్. కోటలో చోటుచేసుకుంది…
తెర్లాం మండలం కునాయవలసకు చెందిన ఈశ్వరరావు Software employee. corona virus కారణంగా work from home చేస్తున్నాడు. ఈయన శుక్రవారం morning walking కోసం గ్రామ శివారులోని రాయిపల్లివారి చెరువు వద్దకు వెళ్ళాడు. అదే సమయంలో నలుగురు వ్యక్తులు వచ్చి కారు ఆగిపోయింది సహకరించాలని కోరారు. దానికి అంగీకరించి వెనకనుంచి కారు నెడుతున్న ఈశ్వరరావుపై కర్రలతో దాడి చేసి.. కాళ్లు, చేతులు కట్టేసి kidnap చేశారు. నలుగురిలో ఒకరు అక్కడ ఉండిపోయి.. ముగ్గురు వ్యక్తులు అదే కారులో ఎస్.కోట మండలం ధర్మవరంలోని ప్రభుత్వ మద్యం దుకాణం పక్కన ఉన్న వాటర్ ప్లాంట్ వద్దకు తీసుకువచ్చారు.
లోపలికి ఈశ్వరరావును తీసుకెళ్తుండగా రక్షించండి అంటూ కేకలు వేశాడు. స్థానికులు అక్కడికి చేరుకుని ఇద్దరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వీరిలో ఒకరు పరారయ్యారు. పారిపోయిన వ్యక్తి వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్న ఎస్.కోట మండలం రేవళ్ల పాలేనికి చెందిన రాజశేఖర్ గా, పట్టుబడిన వారు ఇతని వద్ద డ్రైవర్లు రేవళ్ల పాలేనికి చెందిన గేదెల సత్యనారాయణ, ఎస్.కోటకు చెందిన అంబటి మోహన్ రావుగా గుర్తించామని ఎస్ఐ తారకేశ్వర రావు తెలిపారు.
డబ్బుల కోసమే…
కునాయవలసలో తన ఇంటికి సమీపంలో ఉంటున్న కరుణాకర్ స్నేహితులతో కలిసి డబ్బుల కోసమే ఈ పథకం పన్నాడని బాధితుడు చెప్పినట్లు తెలిపారు. తీవ్ర గాయాలైన ఈశ్వరరావును ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించగా వైద్యులు విజయనగరం రిఫర్ చేశారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. తెర్లాం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరగడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. అక్కడికి కేసు బదిలీ చేయాలా, లేక ఇక్కడి దర్యాప్తు చేయాలన్నది నిర్ణయిస్తామని ఎస్ఐ తెలిపారు.
ఇదిలా ఉండగా, తమ అమ్మాయిని ప్రేమిస్తున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని పక్కాplan తో ఇంట్లో బంధించి విచక్షణా రహితంగా attackచేసిన ఘటన శుక్రవారం Kazipet పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. యువకుడి తండ్రి, యువతి బంధువులు పోలీసులకు పరస్పర ఫిర్యాదు చేయడంతో ఇరు వర్గాలపై కేసు నమోదైంది. బాధితుడి తండ్రి శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మపురం గ్రామానికి చెందిన బైరపాక ప్రభుదాస్ కాంట్రాక్టర్ గా పనిచేస్తూ డీజిల్ కాలనీలో కుటుంబంతో అద్దెకు ఉండేవాడు. ఆయన కుమారుడు ప్రసాద్ ఇంటి యజమాని కూతురుతో ప్రేమగా ఉంటున్నాడని అనుమానంతో గొడవలు జరిగాయి. దీంతో ప్రభుదాస్ కుటుంబం దూరంగా వేరే ఇంటికి మారింది. ఈ క్రమంలో బుధవారం అమ్మాయితో బంధువులు ప్రసాద్ కు ఫోన్ చేయించి ఇంటికి పిలిపించారు.
వచ్చిన ప్రసాద్ ను ఇంట్లోకి తీసుకువెళ్లి.. తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. దీంతో, ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. దాడి చేస్తూ ఫోటోలు, వీడియోలు తీసి ప్రసాద్ మిత్రులకు పంపించడంతో విషయం వెలుగు చూసింది. బాధితురాలి తండ్రి బంధువులు, మిత్రులతో వెళ్లి ప్రసాద్ ను విడిచి పెట్టాలని వేడుకోగా మరోమారు అమ్మాయి జోలికి రావద్దని రాయించుకుని వదిలివేశారు.