జడ్జిలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం... కడపవాసి అరెస్ట్

By Arun Kumar PFirst Published Jul 11, 2021, 9:42 AM IST
Highlights

విదేశాల నుండి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులతో పాటు సుప్రీంకోర్టు జడ్జిలపై అభ్యంతరకర పోస్టింగ్స్ సోషల్ మీడియాలో చేస్తున్న కడవాసిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

అమరావతి: కోర్టు తీర్పులనే తప్పుబడుతూ... న్యాయమూర్తులపై దుష్ప్రచారం చేస్తున్న ఓ వ్యక్తిని సిబిఐ, ఏసిబి పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు జడ్జీలపైనే కాదు సుప్రీం కోర్టు న్యాయమూర్తులపైనా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్న కడప జిల్లావాసిని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.  

వివరాల్లోకి వెళితే... కడప పట్టణానికి చెందిన లింగారెడ్డి రాజశేఖర్ ఉపాధి నిమిత్తం కువైట్ లో వుంటున్నాడు. అక్కడ డ్రైవర్ గా పనిచేసే అతడు ఇటీవల సామాజిక మాధ్యమాల ద్వారా కోర్టు తీర్పులు, న్యాయమూర్తులపై ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నాడు. ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్, వాట్సాప్ ఇలా ఏ సామాజిక మాధ్యమాన్ని వదలకుండా జడ్జీలు ఇచ్చే తీర్పులపై అభ్యంతకర పోస్టులు పెడుతున్నట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. 

read more  మీరు నాపై చేస్తున్నవి ఘజనీ దండయాత్రలు... అనర్హత అసాధ్యం: జగన్ కు రఘురామ లేఖ

ఇలా సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న ఏపీ హైకోర్టు సుమోటాగా తీసుకుంది. వెంటనే విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని సిబిఐని ఆదేశించింది. దీంతో ఏసిబితో పాటు  ఏపీ సీఐడీ(సైబర్ క్రైం) పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే కడపవాసి రాజశేఖర్ రెడ్డి కువైట్ లో వుంటూ న్యాయమూర్తులపై పోస్టింగ్ లు పెడుతున్నట్లు ఏసిబి అధికారులు గుర్తించారు. 

అతడిపై నిఘా వుంచిన అధికారులు శుక్రవారం కడపకు రాగానే అదుపులోకి తీసుకున్నారు. అతడి పాస్‌పోర్టును స్వాధీనం చేసుకుని గుంటూరు కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ కు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది. విచారణ నిమిత్తం నిందితున్ని కస్టడీకి అప్పగించాలని సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. తదుపరి విచారణను కోర్టు 12వ తేదీకి వాయిదా వేసింది. 
  

click me!