స్మార్ట్ యోజన వేల్ఫేర్ సొసైటీ అధినేత సుధాకర్ అరెస్ట్: కాకినాడ కోర్టులో హజరుపర్చిన పోలీసులు

By narsimha lode  |  First Published Sep 12, 2022, 3:25 PM IST

స్మార్ట్ యోజన వేల్ఫేర్ సొసైటీ అధినేత సుధాకర్ ను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక్కో నిరుద్యోగి నుండి రూ. 11 లక్షలు వసూలుచేశారని సుధాకర్ పై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. డబ్బులు తీసుకొని ఫేక్ అపాయింట్ మెంట్ లెటర్లు ఇచ్చారని సుధాకర్ పై ఆరోపణలున్నాయి. 
 



విశాఖపట్టణం: స్మార్ట్ యోజన వేల్ఫేర్ సొసైటీ అధినేత సుధాకర్ ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం నాడు ఆయనను సీఐడీ పోలీసులు కాకినాడ కోర్టులో హజరుపర్చారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని సుధాకర్ నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదులు అందాయి. ఒక్కో నిరుద్యోగి నుండి రూ. 11 లక్షలను వసూలు చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు  సుధాకర్ ను అరెస్ట్ చేశారు.

నిరుద్యోగులకు  ఉద్యోగాలు కల్పిస్తామనే పేరుతో డబ్బులు వసూలు చేసి ఫేక్ అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇచ్చారని సుధాకర్ పై బాధితులు ఫిర్యాదు చేశారు సుధాకర్ పై ఫిర్యాదు చేసేందుకు గాను పోలీసులు నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసి పిర్యాదులు స్వీకరిస్తున్నారు. సుధాకర్ పై ఫిర్యాదు చేసేందుకు పెద్ద ఎత్తున బాధితులు సీఐడీ కార్యాలయం వద్దకు చేరుకున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. 

Latest Videos

click me!