ఇంటి ముందు రోడ్డు వేయించుకోలేని సన్నాసివి.. బాబును విమర్శిస్తావా : కొడాలి నానికి అమర్‌నాథ్ రెడ్డి వార్నింగ్

Siva Kodati |  
Published : Sep 12, 2022, 03:10 PM ISTUpdated : Sep 12, 2022, 03:13 PM IST
ఇంటి ముందు రోడ్డు వేయించుకోలేని సన్నాసివి.. బాబును విమర్శిస్తావా : కొడాలి నానికి అమర్‌నాథ్ రెడ్డి వార్నింగ్

సారాంశం

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి. నీ ఇంటి ముందు రోడ్డు కూడా వేయించుకొలేని సన్నాసివి.. నువ్వు చంద్రబాబు కుటుంబంపై మాట్లాడతా అంటూ ఫైర్ అయ్యారు. ఇట్టాగే వాగితే బుద్ధి చెబుతామని అమర్‌నాథ్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులపై మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు ఆయనపై విరుచుకుపడుతున్నారు. అలాగే ఆదివారం టీడీపీ ఆధ్వర్యంలో గుడివాడలో జరిగిన కొడాలి నాని ఇంటి ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొడాలి నానికి మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు. 

‘‘ ప్రజలు నిన్ను గెలిపించింది నియోజకవర్గాన్ని అభివృధ్ధి చేయాలని.బూతులతో టీడీపీ నాయకులపై దాడి చేయడం కోసం కాదు కొడాలి నాని. నీ ఇంటి ముందు రోడ్డు కూడా వేయించుకొలేని సన్నాసి వెధవ వి నీవు టీడీపీ పైన, చంద్రబాబు గారి కుటుంబం పైన బూతులతో విమర్శిస్తావా.. ఇట్టాగే వాగుతుంటే తగిన బుద్ధి చెబుతాం’’ అని అమర్‌నాథ్ రెడ్డి ట్వీట్ చేశారు. 

అంతకుముందు మాజీ మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, కొల్లు రవీంద్రలను పోలీసులు ఆదివారం నాడు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరు గుడివాడకు వెళ్లకుండా పామర్రులోనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కారులలోనే డోర్ లాక్ చేసుకొని మూడు గంటలకు పైగా కూర్చొని నిరసనకు దిగారు మాజీ మంత్రులు. తమను గుడివాడకు వెళ్లకుడా పోలీసులు అడ్డుపడడాన్ని వీరు తప్పుబట్టారు. అయితే కారు డోర్ ను ఓపెన్ చేసి మాజీ మంత్రులు దేవినేని ఉమ మహేశ్వరరావు, కొల్లు రవీంద్రలను పోలీసులను అదుపులోకి తీసుకున్నారు.

ALso REad:జగన్ పోనీలే అంటున్నారు.. తలచుకుంటే ఇంటికొచ్చి కొడతాం : బాబు, లోకేశ్‌లకు కొడాలి నాని వార్నింగ్

గత గురువారం గుడివాడ 34వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ... జగన్ కుటుంబ సభ్యుల గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే, చంద్రబాబు కుటుంబ బతుకు బయటపెడతానని హెచ్చరించారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేష్ తో పాటుగా ఓవరాక్షన్ చేస్తున్న వారందరినీ రాష్ట్రం నుండి తరిమికొడతామని కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారతమ్మ గురించి మరోసారి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని లోకేష్‌ను హెచ్చరించారు. 

పాముల్లాంటి చంద్రబాబు , లోకేష్ గురించి జగన్‌కు ముందే చెప్పానని... ఆయన పోనీలే అనబట్టే ఇలా ప్రవర్తిస్తున్నారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ ఉత్తర కుమార ప్రగల్బాలు ఆపకపోతే, తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాడని ఆయన హెచ్చరించారు. తనను ఏదో చేద్దామనుకొని నలుగురు ఆడవాళ్ళను తన ఇంటిపైకి పంపారని కొడాలి నాని దుయ్యబట్టారు. తాము తలచుకుంటే తండ్రి కొడుకులిద్దరిని ఇంటికి వెళ్లి కొడతామని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu