
ప్రకాశం జిల్లా మార్కాపురంలో మంత్రి విడదల రజిని పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. మార్కాపురం మండలం రాయవరం వద్ద మంత్రి విడదల రజిని కాన్వాయ్‌లోని రెండు కార్లు ఢీకొన్నాయి. బైక్‌ను తప్పించే క్రమంలో ఒక కారు మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. అయితే ఆ సమయంలో మంత్రి విడదల రజిని వాహనంలో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో మంత్రి విడదల రజిని.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వాహనంలో ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమచారం తెలియాల్సి ఉంది.