(వీడియో) కార్పొరేట్ కాలేజీల్లో ఎలా కొడతారో చూడండి

Published : Oct 16, 2017, 08:18 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
(వీడియో) కార్పొరేట్ కాలేజీల్లో ఎలా కొడతారో చూడండి

సారాంశం

కార్పొరేట్ కళాశాలల్లో వేధింపులు, చదవుల ఒత్తిడి తదితరాలపై చంద్రబాబునాయుడు పెద్ద మీటింగే పెట్టారు సోమవారం. మీటింగ్ లో చంద్రబాబు కళాశాలల యాజమాన్యాలకు అనేక హెచ్చరికలు కూడా జారీ చేసారు. మొత్తం వ్యవస్ధ అంతా నాలుగు రోజుల్లో మారిపోవాలని కూడా అల్టిమేటమ్ జారీ చేసారు. అంతా బాగానే ఉంది. ఒకవైపు చంద్రబాబు సమావేశం నిర్వహిస్తుండగానే ఇంకోవైపు కార్పొరేట్ కళాశాలల్లో వేధింపులు ఎలా ఉంటాయో అనేందుకు  ఉదాహరణగా ఓ వీడియో బయటకు వచ్చింది.

కార్పొరేట్ కళాశాలల్లో వేధింపులు, చదవుల ఒత్తిడి తదితరాలపై చంద్రబాబునాయుడు పెద్ద మీటింగే పెట్టారు సోమవారం. మీటింగ్ లో చంద్రబాబు కళాశాలల యాజమాన్యాలకు అనేక హెచ్చరికలు కూడా జారీ చేసారు. మొత్తం వ్యవస్ధ అంతా నాలుగు రోజుల్లో మారిపోవాలని కూడా అల్టిమేటమ్ జారీ చేసారు. అంతా బాగానే ఉంది. ఒకవైపు చంద్రబాబు సమావేశం నిర్వహిస్తుండగానే ఇంకోవైపు కార్పొరేట్ కళాశాలల్లో వేధింపులు ఎలా ఉంటాయో అనేందుకు  ఉదాహరణగా ఓ వీడియో బయటకు వచ్చింది. వీడియోలో పిల్లలు వేసుకున్న యూనిఫారంను బట్టి అది ఏ కళాశాలో ఎవరికైనా అర్ధమైపోతుంది.

అంత ఎదిగిన పిల్లలను ఓ టీచర్ అందరి ముందూ ఎలా కొడుతున్నాడో చూడండి. అందరిముందు టీచర్ కొట్టిన తర్వాత విద్యార్ధి అవమానంగా ఫీలవుతాడు. ఇలాంటి సంఘటనలు రెండు మూడు జరిగితే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఎవరు విడమరచి చెప్పక్కర్లేదు. ఇటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది కనుకనే చదువు విషయంలో ఒత్ళిళ్ళు, మానసిక ఇబ్బందులు తదితరాలు తలెత్తుతున్నాయ్. అందుకనే కార్పొరేట్ విద్యాసంస్ధల్లోనే ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి.

 

PREV
click me!

Recommended Stories

Pemmasani Chandrasekhar Powerful Speech: Atal Bihari Vajpayee 101st Jayanthi | Asianet News Telugu
Chandrababu Naidu Speech: చరిత్ర తిరగరాసే నాయకత్వం వాజ్ పేయీది: చంద్రబాబు| Asianet News Telugu