తూ.గో జిల్లాలో అమానుషం... ఆరేళ్ళ పసిపాపపై కన్నతండ్రి అత్యాచారం

Arun Kumar P   | Asianet News
Published : Sep 05, 2021, 07:41 AM IST
తూ.గో జిల్లాలో అమానుషం... ఆరేళ్ళ పసిపాపపై కన్నతండ్రి అత్యాచారం

సారాంశం

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కూతురిని కాటేశాడు. అభం శుభం తెలియని ఆరేళ్ల కూతురిపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. 

ఏలేశ్వరం: కన్న కూతురిని కంటికిరెప్పలా కాపాడుకోవాల్సిన వాడే సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించాడు. కామంతో కళ్లుమూసుకుపోయిన కన్నతండ్రి వావివరసలు మరిచి కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆరేళ్ళ కూతురిపైనే కాకుండా కూతురు వరయ్యే మరో బాలికపైనా అత్యాచారానికి ఒడిగట్టాడు ఈ కామాంధుడు. ఈ అమానుషం తూర్పు గోదావరి జిల్లాలో కాస్త ఆలస్యంగా బయటపడింది.  

వివరాల్లోకి వెళితే.... తూ.గో జిల్లా ఏలేశ్వరం మండలానికి చెందిన ఓ 14ఏళ్ల బాలిక ఆగస్ట్ 15న అత్యాచారానికి గురయ్యింది. బాలికను దుండగుడు బెదిరించడంతో తనపై జరిగిన అఘాయిత్యం గురించి సదరు బాలిక తల్లిదండ్రులకు చెప్పలేదు. అయితే తాజాగా ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది బాధిత బాలిక. దీంతో వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

read more  క్రిష్ణా జిల్లాలో 14 యేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం...

బాబాయ్ వరసయ్యే వ్యక్తే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డట్లు గుర్తించిన పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా మరో దారుణం గురించి బయటపడింది. ఈ కామాంధుడు ఆరేళ్ల సొంత కూతురిపైనా అఘాయిత్యానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు.  

అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడిన ఇతడికి కఠిన శిక్ష విధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించినట్లు దిశ డీఎస్పీ మురళీమోహన్‌ తెలిపారు. 


 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్