ఏపీలో రోడ్ల దుస్థితి ఇది.. చక్రాలు ఊడిపోయి నిలిచిపోయిన బస్సు, ఫొటోలు వైరల్

By Siva KodatiFirst Published Sep 4, 2021, 8:24 PM IST
Highlights

తూర్పు గోదావరి జిల్లాలో గోకవరం నుంచి గుర్తేడు పాతకోట వెళ్లే ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఊడిపోయాయని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆ రోడ్డు ఎలా ఉందో చూడండి అంటూ ఫొటోలు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు అధ్వాన్నంగా తయారైన సంగతి తెలిసిందే. వర్షకాలం కావడంతో ఇది మరింత తీవ్రమైంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఏపీలో రోడ్ల పరిస్థితిపై జనసేన నేతలు కొన్నిరోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. రోడ్ల పరిస్థితిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ శనివారం ఆసక్తికరమైన ఫొటోలు పంచుకున్నారు. ఓ ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఊడిన స్థితిలో రోడ్డుపై నిలిచిపోయి ఉంది.

దెబ్బతిన్న రోడ్ల దుష్ఫలితం అంటూ నాదెండ్ల బస్సు పరిస్థితిపై స్పందించారు. తూర్పు గోదావరి జిల్లాలో గోకవరం నుంచి గుర్తేడు పాతకోట వెళ్లే ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఊడిపోయాయని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆ రోడ్డు ఎలా ఉందో చూడండి అంటూ ఫొటోలు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 


 


దెబ్బ తిన్న రోడ్ల దుష్ఫలితం...
కొద్దిసేపటి క్రితమే తూర్పు గోదావరి జిల్లాలో గోకవరం నుంచి గుర్తేడు పాతకోట వెళ్లే బస్సు వెనక చక్రాలు ఊడిపోయాయి. ఆ రోడ్డు ఎలా ఉందో చూడండి. pic.twitter.com/DrTgNtqfWG

— Manohar Nadendla (@mnadendla)
click me!