వివేకా హత్య కేసు: సీబీఐ ఎదుట హాజరైన జగన్ మేనమామ పీ.రవీంద్రనాథ్ రెడ్డి

By Siva KodatiFirst Published Sep 4, 2021, 7:45 PM IST
Highlights

మాజీ మంత్రి, ఏపీ  సీఎం వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం జగన్ మేనమామ, కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి విచారణకు హాజరయ్యారు.

మాజీ మంత్రి, ఏపీ  సీఎం వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం జగన్ మేనమామ, కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య తర్వాత రవీంద్రనాథ్‌రెడ్డి సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరుకావడం ఇదే తొలిసారి. కడప కేంద్ర కారాగారం గెస్ట్‌హౌస్‌లో సీబీఐ అధికారులు ఆయనను విచారించారు. 

ఈ కేసులో అనుమానితుడిగా వున్న సునీల్ యాదవ్‌కు రిమాండ్‌ను 15 రోజులకు పొడిగించింది జమ్మలమడుగు కోర్ట్. సునీల్ యాదవ్‌కు నార్కో అనాలిసిస్ టెస్ట్ అనుమతిపై వాదనలు విన్నారు జమ్మలమడుగు మేజిస్ట్రేట్. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్ చేశారు. 

అంతకుముందు ఆగస్టు 16న సునీల్ యాదవ్ ను  మరోసారి కస్టడీకి ఇచ్చేందుకు పులివెందుల కోర్టు నిరాకరించింది. గోవాలో అరెస్టైన సునీల్ యాదవ్ ను సీబీఐ అధికారులు కోర్టు అనుమతితో 10 రోజుల క్రితం కస్టడీలోకి తీసుకొన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీల్ యాదవ్ అరెస్ట్ తర్వాత కీలక డాక్యుమెంట్లు, ఆయుధాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.ఈ కేసులో  పలువురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

click me!