విజయవాడ గురునానక్‌ డ్రైన్‌లో కొట్టుకుపోయిన ఆరేళ్ల అభిరామ్: లభ్యమైన డెడ్‌బాడీ

Published : May 05, 2023, 04:15 PM IST
విజయవాడ గురునానక్‌ డ్రైన్‌లో కొట్టుకుపోయిన  ఆరేళ్ల అభిరామ్:  లభ్యమైన డెడ్‌బాడీ

సారాంశం

విజయవాడ గురునానక్ కాలనీలో  ఇవాళ   కొట్టకుపోయిన అభిరామ్ డెడ్ బాడీని  గుర్తించారు. మూడు గంటల తర్వాత  ఈ మృతదేహం లభ్యమైంది.

విజయవాడ:  నగరంలోని గురునానక్ కాలనీలో  డ్రైన్ లో  పడిపోయిన  ఆరేళ్ల బాలుడు  అభిరామ్  డెడ్ బాడీని శుక్రవారంనాడు సాయంత్రం  గుర్తించారు. అభిరామ్ డ్రైన్ లో పడిపోయిన కొద్దిదూరంలోనే మృతదేహన్ని  గుర్తించింది రెస్క్యూటీం.

also read:విజయవాడలో విషాదం: డ్రైన్ లో కొట్టుకుపోయిన ఆరేళ్ల బాలుడు

మూడు గంటల గాలింపు చర్యల తర్వాత   అభిరామ్ డెడ్ బాడీ  లభ్యమైంది. ఇవాళ  మధ్యాహ్నం   1:20  గంటలకు  అభిరామ్ డ్రైన్ లో పడిపోయాడు. డ్రైన్ లో పడిపోయిన అభిరామ్ ను కాపాడేందుకు  స్నేహితులు  ప్రయత్నించారు.  కానీ  సాధ్యం కాలేదు.   ఈ విషయమై  ఫిర్యాదు అందడంతో  అగ్నిమాపక సిబ్బంది,. పోలీసులు డ్రైన్ లో గాలింపు చర్యలు చేపట్టారు.  మూడు గంటల గాలింపు తర్వాత  అభిరామ్ డెడ్ బాడీ లభ్యమైంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ప్ర‌ధాని మోదీతో గంట‌న్న‌ర స‌మావేశ‌మైన సీఎం చంద్ర‌బాబు.. ఏం మాట్లాడ‌రంటే.?
Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం