విశాఖ జిల్లాలో దారుణం: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య

Published : Apr 15, 2021, 08:39 AM ISTUpdated : Apr 15, 2021, 09:05 AM IST
విశాఖ జిల్లాలో దారుణం: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య

సారాంశం

విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు హత్యకు గురయ్యారు. కుటుంబ కలహాలే ఈ హత్యలకు కారణం కావచ్చునని అంటున్నారు.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురయ్యారు. విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తి మండలం జుత్తాడ గ్రామంలో ఈ దారుణం జరిగింది. అప్పలరాజు అనే వ్యక్తి ఈ హత్యలకు పాల్పడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలు ఈ హత్యలకు కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు. అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మృతదేహాలు ఇంట్లో రక్తం మడుగులో పడి ఉన్నాయి. ఇంట్లో నిద్రిస్తున్నవారిపై నిందితుడు పదునైన ఆయుధంతో దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. రెండు కుటుంబాల మభ్య పాతకక్షలు ఈ హత్యలకు కారణం కావచ్చునని కూడా భావిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.

మృతులు రామారావు కుటుంబానికి చెందినవారు. రామారావుకు, అప్పలరాజుకు మధ్య పాతకక్షలు ఉన్నాయని అంటున్నారు బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ హత్యలు జరిగాయి.

ఇదిలావుంటే విశాఖపట్నం మధురవాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మధురవాడలోని ఆదిత్య ఫార్చూన్ టవర్స్ లో ఆ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. 

అయితే ఘటనా స్థలంలో రక్తం మరకలు కనపించాయి. దీంతో మరణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిని హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. 

ఆ సంఘటన గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జరిగింది. ఆదిత్య ఫార్చూన్ టవర్స్ లో దాదాపు వంద ఫ్లాట్స్ ఉంటాయి. మృతులను బంగారు నాయుడు, నిర్మల, దీపక్, కశ్యప్ లుగా గుర్తించారు. బంగారునాయుడు ఆ ప్రైవేట్ విద్యాసంస్థలో పనిచేస్తున్నట్లు తెలుసతోంది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్