తెలుగు రాష్ట్రాల్లో అమిత్ షా టూర్: శ్రీశైలంలో ప్రత్యేక పూజలు

By narsimha lodeFirst Published Aug 12, 2021, 12:00 PM IST
Highlights


హైద్రాబాద్ కు కేంద్ర మంత్రి అమిత్ షా వచ్చారు. శ్రీశైలంలో మల్లిఖార్జునస్వామిని దర్శించుకొనేందుకు కుటుంబసభ్యలతో కలిసి ఆయన గురువారం నాడు హైద్రాబాద్ వచ్చారు. ఇవాళ మధ్యాహ్నం శ్రీశైలం నుండి  ఆయన తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. 
 

హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం నాడు హైద్రాబాద్ చేరుకొన్నారు. హైద్రాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆయన శ్రీశైలం దేవాలయానికి బయలుదేరారు.లోక్‌సభ వాయిదా పడిన మరునాడే అమిత్ షా కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలంలో భ్రమరాంబ మల్లిఖార్జునస్వామిలను దర్శనం చేసుకొనేందుకు వచ్చారు.

ఇవాళ ప్రత్యేక విమానంలో అమిత్ షా ఢిల్లీ నుండి హైద్రాబాద్ కు వచ్చారు. హైద్రాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన శ్రీశైలం చేరుకొన్నారు. శ్రీశైలంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఆయన మధ్యాహ్నం తిరిగి హైద్రాబాద్ కు చేరుకొంటారు. హైద్రాబాద్ నుండి ఆయన తిరిగి  ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.

నిత్యం రాజకీయ కార్యకలాపాలతో బిజీగా ఉండే అమిత్ షా ఇవాళ కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలం ఆలయంలో పూజలు చేసేందుకు వచ్చారు. ఆలయంలో పూజలు చేసిన తర్వాత ఆయన వెంటనే ఢిల్లీకి తిరిగి వెళ్థారని అధికారవర్గాలు తెలిపాయి.

click me!