అల్లూరి జిల్లాలోని చింతూరులో మంగళవారంనాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు.మృతులంతా ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందినవారు.
చింతూరు: అల్లూరి జిల్లాలోని చింతూరు మండలంలో మంగళవారంనాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వ్యాన్, లారీ డీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చింతూరు మండలం బొడ్డుగూడెంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. భద్రాచలంలో శ్రీరామచంద్రస్వామని దర్శించుకొని చత్తీస్ ఘడ్ కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వ్యాన్ డ్రైవర్ అతివేగంగా వాహనాన్ని నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రోజుకు పలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యంతో పాటు , రోడ్లు సరిగా లేని కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడంతో పాటు అతి వేగంగా డ్రైవింగ్ చేయడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.యూపీ రాష్ట్రంలోని ఆజంఘడ్ లో ఈ నెల 20వ తేదీన రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. తెలంగాణలోని వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండలం బొమ్మలపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.ఈ ఘటన ఈ నెల 20వ తేదీన జరిగింది.
undefined
ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. హైద్రాబాద్ నుండి బెంగుళూరు ఆర్టీసీ బస్సు వెళ్తుంది. ఈ నెల 16న ఉత్తరాఖండ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి చెందారు. చమోలి వద్ద బస్సు లోయలో పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సత్యసాయి జిల్లాలోని కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లి వద్ద కల్వర్టు గోడను కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దరియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 6వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.మరో 25 మంది గాయపడ్డారు.